లులు తొలి డ్రా: 25,000 బహ్రెయినీ దినార్స్‌ రివార్డ్‌

- October 14, 2020 , by Maagulf
లులు తొలి డ్రా: 25,000 బహ్రెయినీ దినార్స్‌ రివార్డ్‌

మనామా:లులు హైపర్‌ మార్కెట్‌ - షాప్‌ అండ్‌ విన్‌ ప్రమోషన్‌ తొలి ఇ-ర్యాఫిల్ డ్రా అక్టోబర్‌ 4న జరిగింది. 400 మంది లక్కీ షాపర్స్‌ని ఎంపిక చేశారు. 25,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన బహుమతుల్ని గెల్చుకున్నారు విజేతలు. షాప్‌ అండ్‌ విన్‌ ప్రమోషన్‌లో భాగంగా 150,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన గిఫ్ట్‌ వోచర్స్‌ని ఇవ్వనున్నారు. 100 బహ్రెయినీ దినార్స్‌, 50 అలాగే 25 బహ్రెయినీ దినార్స్‌ డినామినేషన్స్‌తో వీటిని రూపొందించారు. ఈ ఏడాది చివరి వరకు మొత్తం ఐదు రఫాలె డ్రాలుంటాయి. తమ బహుమతుల్ని అందుకోవడానికి దానా మాల్‌ వద్దనున్న లులు హైపర్‌ మార్కెట్‌ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ని సంప్రదించాల్సి వుంటుంది. 150 మంది విజేతలకు 100 బహ్రెయినీ దినార్స్‌ విలువైన గిఫ్ట్‌ కార్డ్‌, 150 మందికి 40 విలువైన గిఫ్ట్‌ కార్డ్‌, 100 మందికి 25 విలువైన కార్డ్‌ అందిస్తున్నారు. తదుపరి ఇ-రఫాలె డ్రా 18 అక్టోబర్‌న జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com