దుబాయ్‌ గిఫ్ట్‌ కంపెనీని మోసం చేసిన ‘సీఈఓ’

- October 15, 2020 , by Maagulf
దుబాయ్‌ గిఫ్ట్‌ కంపెనీని మోసం చేసిన ‘సీఈఓ’

దుబాయ్:  ఓ ప్రైవేటు జెట్‌ కంపెనీకి చెందిన సీఈవోనంటూ ఓ వ్యక్తి, దుబాయ్‌లోని ఓ గిఫ్ట్‌ కంపెనీని మోసం చేశాడు. రెండు ఐ ఫోన్‌లను, రెండు పెర్‌ఫ్యూములను అలాగే ఓ ఫ్లవర్‌ బొకేని యూఏఈలోని తన అతిథులకు పంపాల్సిందిగా సదరు దుబాయ్‌ గిఫ్ట్‌ కంపెనీని కోరాడు నిందితుడు. నిందితుడు, 25,800 దిర్హాముల విలువైన బ్యాక్‌ ట్రాన్సాక్షన్స్‌ని ఫేక్‌ చేశాడు. ఈ విషయాల్ని బుర్‌ దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, సీనియర్‌ ప్రాసిక్యూటర్‌ అహ్మద్‌ అబ్దుల్లా అల్‌ అత్తార్‌ వెల్లడించారు. దుబాయ్‌లోని ఓ ధనిక కుటుంబానికి చెందినవాడిగా నిందితుడు, గిఫ్ట్‌ కంపెనీని మోసం చేసినట్లు ప్రాసిక్యూటర్‌ పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ముగ్గురు అనుమానితుల్ని దుబాయ్‌ మిస్‌డెమీనర్‌ కోర్టు ముందుంచడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com