సివిల్‌ ఐడీ కార్డులు కలెక్ట్‌ చేసుకోవాలని పిఎసిఐ సూచన

- October 16, 2020 , by Maagulf
సివిల్‌ ఐడీ కార్డులు కలెక్ట్‌ చేసుకోవాలని పిఎసిఐ సూచన

కువైట్ సిటీ:పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌, సివిల్‌ ఐడీ కార్డుల్ని పౌరులు అలాగే రెసిడెంట్స్‌ కలెక్ట్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మెషీన్‌లో 100,000కి పైగా కార్డులు అలాగే వుండిపోయిన దరిమిలా కొత్త కార్డుల్ని అందులో పెట్టడానికి వీలు లేకుండా పోతోందని అథారిటీ పేర్కొంది. ఇప్పటిదాకా 858,000 కార్డుల్ని సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌కి లాక్‌డౌన్‌ రీ-ఓపెన్‌ తర్వాత జారీ చేయడం జరిగింది. నాన్‌ కువైటీలకు 484,298 కార్డులు జారీ చేశారు. ఇప్పటికే పొందుపరిచిన కార్డుల్ని ఆయా వ్యక్తులు తీసుకుంటే, కొత్త కార్డుల్ని మెషీన్లలో ఇన్‌స్టాల్‌ చేయడానికి వీలవుతుందని పిఎసిఐ ప్రొడక్షన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జాసెం అల్‌ మితెన్‌ విజ్ఞప్తి చేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com