మొహమ్మద్ ప్రవక్త జన్మదినం ఆక్టోబర్ 29న సెలవు ప్రకటించనున్న యూఏఈ
- October 17, 2020యూఏఈ: ఇస్లాం అరాధకుడు మొహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు ఈ నెల 29న రావొచ్చని అరబ్ యూనియన్ ఖగోళశాస్త్ర సభ్యుడు ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మొహమ్మద్ ప్రవక్త క్రీ.శ. 570వ సంవత్సరంలో సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించారు. అయితే..ఆయన పుట్టినరోజు తేదిపై మాత్రం స్పష్టత లేదు. దీంతో ఇస్లామిక్ సంవత్సరంలోని మూడవ నెలలో రబీ అల్ అవ్వాల్ 12వ రోజున ఆయన పుట్టినరోజును పాటిస్తారు. ఈ మేరకు ఈ నెల 29న ప్రవక్త జన్మదినం రానుంది. దీంతో ఈ వారంతపు సెలవులు పెరగనున్నాయి. ప్రవక్త పుట్టినరోజున ముస్లింలు అంతా అథ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఉపవాసం ఉండటం, పవిత్ర ఖురాన్ పఠిస్తూ ఆథ్యాత్మికత పాటిస్తారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు