శబరిమలలో కలకలం.. భక్తుడికి కరోనా నిర్ధారణ
- October 19, 2020
శబరిమలలో కరోనా కలకలం రేపింది. దర్శనానికి వచ్చిన ఒక భక్తుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో యాత్రకు వచ్చిన మిగతా భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ వచ్చిన భక్తుడిని తమిళనాడు వాసిగా గుర్తించారు. అతడిని కరోనా కేంద్రానికి తరలించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం శబరిమలకు వచ్చే వారికి మార్గదర్శకాలను విడుదల చేసింది. శబరిమల యాత్రికులు దర్శనం కోసం టైమ్ స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికోసం https://sabarimalaonline.org వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు 48 గంటల ముందు యాంటిజెన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షలకు సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు చూపించాలి. ఇందులో నెగటివ్ అని తేలిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ప్రతిరోజు కేవలం 250 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా 10 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్నవారికి మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అలాగే భక్తులు పంబ నదిలో స్నానాలు చేయడం, అభిషేకాలు చేయడాన్ని నిషేధించారు. భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!