భారతదేశంలో కోవిడ్‌-19 మహమ్మారి ‘సెకండ్‌ వేవ్‌’ను తోసిపుచ్చలేం

- October 19, 2020 , by Maagulf
భారతదేశంలో కోవిడ్‌-19 మహమ్మారి ‘సెకండ్‌ వేవ్‌’ను తోసిపుచ్చలేం

కోవిడ్‌-19 రోజవారీ కొత్త కేసులలో తగ్గుదల నిజంగా ఒక శుభవార్తే

గత రెండు పక్షం రోజుల కాలంలో కొత్త కోవిడ్‌-19 కేసుల నమోదులో తగ్గుదల ఉన్నదనే సంతోషకరమైన వార్తను మనం వింటున్నాము.  సెప్టెంబర్‌ 16 నుండి 30తో ముగిసిన పక్షం రోజులతో పోలిస్తే, అక్టోబర్‌ 1 నుండి 15 వరకు ఉన్న అక్టోబర్‌ మొదటి పక్షం రోజుల కాలంలో భారతదేశంలో కొత్త కేసులు నమోదులో 18%  వరకు తగ్గుదల ఉన్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్‌ 1 నుండి 15 వరకు ఉన్న మొదటి పక్షం రోజుల కాలంతో పోలిస్తే సెప్టంబర్‌ నెల రెండవ పక్షంలోని కేసులు 3% తక్కువగా నమోదు అయినాయి. భారతదేశంలో కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తిలో ప్రస్తుతం తగ్గుదల ఉన్నదని స్పష్టంగా తెలుస్తున్నది. అంటే మనం అత్యంత క్లిష్ట పరిస్థితులను దాటుకుని వచ్చామా? లేక భారతదేశంలో కోవిడ్‌-19 మహమ్మారి ‘సెకండ్‌ వేవ్‌’ వచ్చే అవకాశం ఉన్నదా?

ప్రతీకారేచ్చతో యూరప్‌ మరియు అమెరికాను తాకిన కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌

పలు యూరోపియన్‌ దేశాలు కోవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ యొక్క సెకండ్‌ వేవ్‌తో అతలాకుతలం అవుతున్నాయి, అంతేకాకుండా మొదటి వేవ్‌లో వచ్చిన కేసుల సంఖ్య కంటే రెండవ వేవ్‌లోనే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మార్చి 31న ఫ్రాన్స్‌లో రోజువారీ కొత్త కేసులు 7,500 ఉండగా, అది అక్టోబర్‌ 10తో గడిచిన 24 గంటకు 26,675 సంఖ్యతో అత్యధిక కేసులు నమోదు అయినాయి. అదేవిధంగా యూకెలో ఏప్రిల్‌ 10న రోజువారీ 7,860 కేసులు నమోదుకాగా, అక్టోబర్‌ 8న 17,540 కేసులతో అది గరిష్టస్థాయికి చేరుకున్నది, గత వారంలో ఆ సంఖ్య 20,000లు ఉన్నట్లుగా నివేదించబడిరది. మరో నివేదిక ప్రకారం ఫ్రెంచ్‌ ఆసుపత్రులు కోవిడ్‌ కేసులతో కిటకిటలాడిపోతున్నాయి, సమీప భవిష్యత్తులో ఐసియూ పడకలతో సహా ఆసుపత్రులో పడకల కొరత కూడా తీవ్రతరం అవుతుందని అక్కడి వైద్యులు భయపడుతున్నారు. కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ ప్రస్తుతం అన్ని యూరోపియన్‌ దేశాలలో కనిపిస్తున్నది. అంతేకాకుండా మొదటిసారి వైరస్‌ దాడి చేసిన  దానికంటే సెకండ్‌ వేవ్‌లోనే  కేసుల సంఖ్య అత్యధికంగా ఉంటున్నది. మరోవైపు అమెరికా కోవిడ్‌-19 అంటువ్యాది ‘థర్డ్‌వేవ్‌’ దశకు వెళ్లింది. 10 రోజుల క్రితం కొత్త కేసుల సంఖ్య 40,000లుగా నమోదుకాగా నిన్న కొత్త కేసుల సంఖ్య 63,000తో పెద్ద ఎత్తున పెరిగింది.

భారతదేశంలో కోవిడ్‌-19 ‘‘సెకండ్‌ వేవ్‌’’కు ఉన్న స్పష్టమైన అవకాశాలు

1. కోవిడ్‌-19 ముందు జాగ్రత్తలతో ప్రజులు అలసిపోయి ప్రస్తుతం వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు : కోవిడ్‌-19 అంటువ్యాధి రాకుండా ప్రజలు గత ఆరు నెలలుగా పలు జాగ్రత్తలను పాటిస్తూ వస్తున్నారు. ఇంత కాలం అయిన తరవాత, ఎక్కువ మంది ప్రజలలో జాగ్రత్తల పట్ల కొంత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తున్నది. బహిరంగ ప్రదేశాలోకి వచ్చినప్పుడు మాస్క్‌ను వాడడం అనేది తప్పనిసరి. అయితే, ప్రస్తుతం చాలామంది ఫేస్‌ మాస్క్‌లు అనేవి లేకుండా బయట తిరగడాన్ని మనం చూడవచ్చు. సామాజిక దూరం నియమాన్ని కూడా చాలా సందర్బాలో పాటించడం లేదు.  తరుచుగా చేతులు సబ్బుతో కడుక్కోవాలనే నిబంధనలను చాలామంది గాలికి వదిలేశారు. కోవిడ్‌-19 కేసుల సంఖ్య తక్కువ కావడం మరియు కోవిడ్‌-19 సంబంధిత వార్తలకు మీడియాలో తక్కువ ప్రాధన్యత ఉండడం వలన  భవిష్యత్తులో నిర్లక్ష్యం మరియు అజాగ్రత్త అనేది పెరిగే అవకాశం ఉన్నది. కోవిడ్‌-19 అంటువ్యాధి ‘సెకండ్‌ వేవ్‌’కు ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది.

2. శీతాకాలంలో కొత్త కేసుల పెరుగుదల : భారతదేశంలో శీతాకాలంలో అనేక వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, ప్రత్యేకించి ఫ్లూ కేసులు బాగా విజృభిస్తుంటాయి. శీతాకాలం నవంబర్‌తో మొదలై ఫిబ్రవరి నెలతో ముగుస్తుంది. కావున, కోవిడ్‌-19 అంటువ్యాధి కేసులలో కూడా డిసెంబర్‌ 2020 మరియు జనవరి 2021 నెలలలో పెరిగే అవకాశాలు అధికంగావుంది.

3. సమావేశాలు మరియు పండుగలలో ప్రజులు పెద్ద ఎత్తున గుమిగూడడం : రాబోయే 3 నుండి 4 నెలల కాలంలో దసరా, దీపావళి, ఛాత్‌ (బీహార్‌ మరియు ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధానంగా జరుపుకునే పండుగ), క్రిస్‌మస్‌ మరియు సంక్రాంతి వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారతదేశంలో జరుపుకుంటారు. పండుగలలో తగినంత సామాజిక దూరం పాటించడం కష్టం. పెళ్లి వేడుకలు మరియు ఇతర సామాజిక వేడుకలలో పాల్గొనే వారి సంఖ్యకు సంబందించిన నిబంధనలలో సడలింపు వలన  కూడా సామాజిక దూరం కొనసాగడం ఒక సవాలుగా నిలుస్తుంది. భారతదేశంలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో రాబోయే కొద్ది నెలలలోనే ముఖ్యమైన ఎన్నికలు జరగనున్నాయి.

ముందుకు వెళ్లే మార్గం?

కోవిడ్‌-19 మహమ్మారికి వ్యతిరేకంగా మనం జరిపే పోరాటంలో రాబోయే 3 - 4 నెలలు అత్యంత కీలకం. మహమ్మారిని మనం సమర్దంగా మరియు నిర్ణయాత్మకంగా ఎదుర్కోగలమా లేదా అనేది ఈ కాలంలో నిర్ణయం అవుతుంది. అందువలన ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండవసిన అవసరముంది. కోవిడ్‌-19 యొక్క సెకండ్‌ వేవ్‌ రాకుండా నివారించడంలో ఈ క్రింది చర్యలు సహాయపడగవు.

1. బహిరంగ ప్రదేశాలో ఫేస్‌మాస్కును ధరించడం తప్పనిసరి

2. తగినంత సామాజిక దూరాన్ని అన్ని సందర్బాలలో పాటించాలి

3. రాజకీయ, సాంస్కృతిక, మత, క్రీడలు మరియు వినోద కార్యక్రమాలు / సమావేశాలకు హాజరయ్యే వ్యక్తుల సంఖ్యపై పరిమితులు కొనసాగాలి

4. తరచుగా చేతులను సబ్బుతో కడగడం కొనసాగించాలి

5. అనవసరమైన మరియు వినోదంగా చేసే ప్రయాణాలను పరిమితం చేసుకోవాలి

6. హాస్పిటల్‌ మౌలిక సదుపాయాలు (పడకలు, ఉపకరణాలు మరియు సిబ్బంది)ను వేగంగా పెంచుకోవాలి

7. విస్త్రృతంగా టెస్ట్‌లను చేయడం మరియు కాంటాక్ట్‌లను ట్రేసింగ్‌ చేయడాన్ని కొనసాగించాలి

8. వ్యాక్సిన్‌ త్వరగా అభివృద్ది చేసే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

9. వ్యాక్సిన్‌ తయారీ, సేకరణ, రవాణా మరియు నిల్వ కోసం మొత్తం రోడ్‌ మ్యాప్‌ను సిద్దం చేసుకోవాలి. అందుకు తగినన్ని నిధులను కేటాయించాలి.

డా॥ సుధీర్‌ కుమార్‌,

సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌,

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్సెస్‌,

అపోలో హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్(హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com