దుబాయ్:51 మంది మహిళా ఖైదీ పిల్లలకు గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ ఇచ్చిన పోలీసులు

దుబాయ్:51 మంది మహిళా ఖైదీ పిల్లలకు గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ ఇచ్చిన పోలీసులు

దుబాయ్:వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీల పిల్లలకు బహుమతులు ఇచ్చి వారి జీవితంలో ఓ రోజును మరింత అహ్లాదకరంగా మార్చారు దుబాయ్ పోలీసులు. మానవతా దృక్పథంతో చిన్నారుల పట్ల చనువుగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే పోలీసులు తరపున అప్పుడప్పుడు మహిళా ఖైదీల పిల్లలకు గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ చేస్తూ వారిని ఆనందింప చేస్తూ వస్తున్నారు పోలీసులు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 51 మంది మహిళా ఖైదీ పిల్లలకు గిఫ్ట్ లు ఇచ్చినట్లు పోలీసు విభాగంలోని మహిళా, శిశు రక్షణ అధికారులు వెల్లడించారు. జైళ్ల శాఖ అధికారులతో కలిసి తాము చిన్నారులకు బహుమతులను  అందించినట్లు చెప్పారు. అంతేకాదు..చిన్నారుల మానసిక వికాసానికి జైలు వాతావరణం అడ్డంకి కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని...చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులతో ప్లేయింగ్ హాల్ ఏర్పాటు చేశామని, వారికి ప్రత్యేకంగా డైనింగ్ హాల్ సమకూర్చినట్లు పోలీసులు వివరించారు. అలాగే కోవిడ్ 19 బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. చిన్నారులతో పోలీసులు చనువుగా ఉండటం వల్ల చిన్నారులు కొంత సమయాన్నైనా అహ్లాదంగా గడిపే అవకాశం దక్కుతుందని...అందుకే అప్పుడప్పుడు వారికి గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ ఇస్తామని వెల్లడించారు. 2014 నుంచి ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించి..వందల మంది ఖైదీల పిల్లలకు బహుమతులు అందించామన్నారు. 

Back to Top