కువైట్: శీతాకాలంలో కరోనా విజృంభించే ముప్పు..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

- October 20, 2020 , by Maagulf
కువైట్: శీతాకాలంలో కరోనా విజృంభించే ముప్పు..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

కువైట్ సిటీ:కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా..దాని తీవ్రత కొద్దిమేర తగ్గటంతో ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ, రాబోయే శీతాకాలం చాలా దేశాలను భయపెడుతోంది. శీతకాలంలో వైరస్ విజృంభిస్తుందని అంచనా వేస్తున్నారు వైద్య నిపుణులు. దాన్నే కరోనా సెకండ్ వేవ్ అని అంటున్నారు. శీతాకాలంలో కరోనా బారిన పడే వారి సంఖ్య రెట్టింపు అయ్యే ముప్పు ఉందని అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కువైట్ మంత్రిమండలి..తమ వీక్లీ మీటింగ్ లో కరోనా వ్యాప్తిపై చర్చించింది. వచ్చే శీతాకాలంలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో దేశంలోని పౌరులు, ప్రవాసీయులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రిమండలి హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎలా ఉంది..? కువైట్ పరిధిలో వైరస్ ప్రభావం ఎలా ఉందో గణాంకాలతో సహా కువైట్ కేబినెట్ సమీక్షించింది. కువైట్ లో ప్రస్తుతం కరోనా యాక్టీవ్ కేసులు ఎన్ని ఉన్నాయి..వారిలో ఎంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది..ఇప్పటివరకు ఎంతమంది వైరస్ కారణంగా చనిపోయారో అంతర్గత మంత్రిత్వ శాఖ..కేబినెట్ కు వివరించింది. రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, శీతాకాలంలో వైరస్ తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలంతా ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరించింది కేబినెట్. జనసమ్మర్ధ ప్రాంతాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ ఫేస్ మాస్క్ ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవటంతో పాటు నివాస ప్రాంగణాలను, ఆఫీసులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com