దుబాయ్:51 మంది మహిళా ఖైదీ పిల్లలకు గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ ఇచ్చిన పోలీసులు
- October 20, 2020
దుబాయ్:వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీల పిల్లలకు బహుమతులు ఇచ్చి వారి జీవితంలో ఓ రోజును మరింత అహ్లాదకరంగా మార్చారు దుబాయ్ పోలీసులు. మానవతా దృక్పథంతో చిన్నారుల పట్ల చనువుగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే పోలీసులు తరపున అప్పుడప్పుడు మహిళా ఖైదీల పిల్లలకు గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ చేస్తూ వారిని ఆనందింప చేస్తూ వస్తున్నారు పోలీసులు. గత జనవరి నుంచి ఇప్పటివరకు 51 మంది మహిళా ఖైదీ పిల్లలకు గిఫ్ట్ లు ఇచ్చినట్లు పోలీసు విభాగంలోని మహిళా, శిశు రక్షణ అధికారులు వెల్లడించారు. జైళ్ల శాఖ అధికారులతో కలిసి తాము చిన్నారులకు బహుమతులను అందించినట్లు చెప్పారు. అంతేకాదు..చిన్నారుల మానసిక వికాసానికి జైలు వాతావరణం అడ్డంకి కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని...చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులతో ప్లేయింగ్ హాల్ ఏర్పాటు చేశామని, వారికి ప్రత్యేకంగా డైనింగ్ హాల్ సమకూర్చినట్లు పోలీసులు వివరించారు. అలాగే కోవిడ్ 19 బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. చిన్నారులతో పోలీసులు చనువుగా ఉండటం వల్ల చిన్నారులు కొంత సమయాన్నైనా అహ్లాదంగా గడిపే అవకాశం దక్కుతుందని...అందుకే అప్పుడప్పుడు వారికి గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ ఇస్తామని వెల్లడించారు. 2014 నుంచి ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించి..వందల మంది ఖైదీల పిల్లలకు బహుమతులు అందించామన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం