శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త చిత్రం ప్రారంభం!
- October 26, 2020_1603722253.jpg)
హైదరాబాద్:బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి.ఎమ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న నూతన చిత్రం దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచెరపాలెం రాజు, టిఎన్ఆర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కోటి సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ...
మా బ్యానర్ లో నిర్మించిన మొదటి సినిమా కళాపోషకులు విడుదలకు సిద్దంగా ఉంది. దర్శకుడు శివ వరప్రసాద్ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. ఇది మా బ్యానర్ లో వస్తోన్న సెకండ్ ప్రాజెక్ట్. కోటి గారు మా సినిమాకు సంగీతం అందించడం సంతోషంగా ఉంది, దసరా సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవ్వడం ఆనందంగా ఉంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించబోతున్నామని అన్నారు.
డైరెక్టర్ శివ వరప్రసాద్ కె మాట్లాడుతూ...
నవంబర్ నుండి హైదరాబాద్ లో ఈ చిత్ర రెగులర్ షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరణ పూర్తి చేస్తాము. సంగీతం ప్రధాన అంశంగా ఈ సినిమా ఉండనుంది కావున ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతం అందించిన కోటి గారిని తీసుకోవడం జరిగింది. హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన పిఎస్.వినోద్ గారి శిష్యుడు చైతన్య కందుల ఈ సినిమాతో కెమెరామెన్ గా పరిచయం కాబోతున్నాడు. ఇంతవరకు రాని ఒక డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా రూపొందుతుంది. నేను చెప్పిన కథ విని నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
నటీనటులు:
రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కాంచరపాలెం రాజు, టిఎన్ఆర్
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: బేబీ లాలిత్య
బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
నిర్మాత: సుధాకర్ రెడ్డి. ఎమ్
డైరెక్టర్: శివ వరప్రసాద్.కె
కెమెరామెన్: చైతన్య కందుల
ఎడిటర్: సెల్వ
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!