750 కిలోల బరువున్న బంగారు అంబారీని మోసిన అభిమన్యు

- October 26, 2020 , by Maagulf
750 కిలోల బరువున్న బంగారు అంబారీని మోసిన అభిమన్యు

మైసూర్:దసరా వేడుకలనగానే గుర్తొచ్చేది మైసూరు. నమ్మద హబ్బ పేరిట ఏటా దసరా ఉత్సవాలను నిర్వహిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. కర్నాటక సంస్కృతీ సంప్రదాయలకు ఈ ఉత్సవాలు చిహ్నంగా నిలుస్తాయి. మైసూరు మహారాజు కాలం నుండి దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే.. ఈ సారి దసరా ఉత్సవాలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అయినప్పటికి సాంప్రదాయరీతిలో , భక్తిశ్రద్దలతో దసరా ఉత్సవాలను నిర్వహించారు. ఇక... మైసూర్‌ ఉత్సవాల్లో హైలెట్‌ ఏనుగుల జంబూ సవారీ!. మైసూరు మహారాజు వారి కులదైవం చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. అమ్మవారికి సీఎం యడ్యూరప్ప ప్రత్యేక పూజలు చేశారు. ఏటా వేలాది మంది పాల్గొనే ఈ సవారీలో ఈసారి కేవలం 300 మంది అతిథులు మాత్రమే పాల్గొన్నారు. అది కూడా కోవిడ్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన వాళ్లకే అనుమతించారు. జంబూ సవారిలో అభిమన్యు ఏనుగు.... ఠీవీగా నడిచింది. 750 కిలోల బరువున్న బంగారు అంబారీని అభిమన్యు మోసింది. అభిమన్యు వెంట కావేరి, విజయ,గోపి అనే ఏనుగులు నడిచాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com