సౌదీ:డొమస్టిక్ వర్కర్ల కోసం జెడ్డా విమానాశ్రయంలో కొత్త యంత్రాంగం
- October 27, 2020
జెడ్డా:పలు దేశాల నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే గృహ కార్మికులను...భద్రంగా తమ పని చేసే చోటుకు చేర్చేలా సౌదీ ప్రభుత్వం కొత్త యంత్రాంగాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇళ్లలో పని చేసేందుకు కింగ్డమ్ చేరుకునే ప్రవాస కార్మికుల పట్ల రిక్రూట్మెంట్ సంస్థలు, యజమానులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. విమానాశ్రయంలో ఎంట్రీ ప్రాసెస్ పూర్తి అవగానే కార్మికులను వ్యక్తిగతంగా దగ్గరుండి రిసీవ్ చేసుకొని ఎయిర్ పోర్ట్ నుంచి వారు పని చేసే ప్రదేశానికి రిక్రూట్మెంట్ సంస్థలు చేర్చేలా జెడ్డా విమానాశ్రయంలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తొలిసారి సౌదీకి వచ్చే వారి పట్ల మరింత శ్రద్ధ తీసుకునేలా ఈ యంత్రాంగం పనిచేయనుంది. తద్వారా బ్రోకర్లు, ఏజెంట్ల చేతిలో ప్రవాస కార్మికులు మోసపోకుండా కొంత మేర రక్షణ కల్పించటమే ఈ యంత్రాంగం ముఖ్య లక్ష్యం. ఇప్పటికే ఈ తరహా యంత్రాంగం రియాద్ లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా అమలు అవుతోంది. దీంతో జెడ్డా విమానాశ్రయంలోనూ డొమస్టిక్ వర్కర్లను రిసీవ్ చేసుకునే యంత్రాంగాన్ని ప్రారంభించారు. రాబోయే రోజుల్లో సౌదీలోని అన్ని విమానాశ్రాయాల్లో ఈ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!