కువైట్‌ తొలి బ్యాచ్‌ కరోనా వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది మొదట్లో

- October 27, 2020 , by Maagulf
కువైట్‌ తొలి బ్యాచ్‌ కరోనా వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది మొదట్లో

కువైట్ సిటీ:కరోనా వ్యాక్సిన్‌, దేశంలోకి వచ్చే ఏడాది తొలి క్వార్టర్‌లో వస్తుందని తెలుస్తోంది. తొలి బ్యాచ్‌లో ఒక మిలియన్‌ డోసులు సిటిజన్స్‌ కోసం కేటాయిస్తారు. హెల్త్‌ వర్కర్స్‌, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌, వృద్ధులు, క్రానిక్‌ డిసీజ్‌లతో వున్నవారికి ప్రాధాన్యత వుంటుంది. 3 కంపెనీల నుంచి వ్యాక్సిన్లు వచ్చే అవకాశం వుంది. ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారిక్‌ అల్‌ ముజ్రిం వెల్లడించిన వివరాల ప్రకారం, కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అలాగే, సంబంధిత అథారిటీస్‌ నుంచి మెంబర్స్‌ ఈ కమిటీలో వుంటారు. వ్యాక్సినేషన్‌కి సంబంధించిన విధి విధానాల్ని ఈ కమిటీ నిర్ధారిస్తుంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com