అబుధాబి డ్రైవ్ త్రూ - కోవిడ్ 19 టెస్టింగ్ ఫెసిలిటీ
- October 27, 2020
అబుధాబి:కొత్త డ్రైవ్ త్రూ లేన్ - కోవిడ్ 19 టెస్టింగ్ ఫెసిలిటీ అబుధాబిలో ప్రారంభమయ్యింది. మురూర్‌లోని అల్ జజిరా స్పోర్ట్స్ క్లబ్ ఎదురుగా క్యాపిటల్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ ఎదురుగా ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. రెసిడెంట్స్ మరియు టూరిస్టులు 180 దిర్హాములకే టెస్ట్ చేసుకోవచ్చు. ముందస్తుగా అపాయింట్‌మెంట్స్ అవసరం లేదు. ఎస్‌ఎంఎస్ ద్వారా 24 నుంచి 38 గంటల్లోపు వారికి రిజల్ట్ అందుతుంది. ముబాదల హెల్త్ కేర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హసన్ జసెం అల్ నోవాయిస్ మాట్లాడుతూ, తమ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ కోవిడ్ 19 ఫ్రీగా మారడంతో, ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకారాలు అందించే క్రమంలో హై వాల్యూం టెస్టింగ్ పాలసీని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత ఖచ్చితత్వంతో డెడికేటెడ్ లేబరేటరీ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం