భారత్ లో 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు
- October 28, 2020
న్యూఢిల్లీ:భారత్‌లో గడిచిన 24 గంటల్లో 43,893 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,90,322కి చేరింది. నిన్న ఒక్క రోజే 508 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,20,010 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 58,439 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 72,59,509 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,803 గా ఉంది.
కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,83,608 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 9,72,00,379 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎమ్ఆర్(ICMR) తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







