ECIL‌లో ఉద్యోగావకాశాలు..

- October 28, 2020 , by Maagulf
ECIL‌లో ఉద్యోగావకాశాలు..

హైదరాబాద్:ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేసింది ఈసీఐఎల్. ఇప్పుడు మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆపీసర్, లైజన్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 25 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 23న ప్రారంభమైంది. అప్లై చేయడానికి నవంబర్ 3 చివరి తేది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం http://www.ecil.co.in/ వెబ్‌సైట్ చూడాలి. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://careers.ecil.co.in/వెబ్‌సైట్ చూడాలి. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్న అభ్యర్ధులు https://careers.ecil.co.in/వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 25.. టెక్నికల్ ఆఫీసర్: 24.. హైదరాబాద్: 11, బఠిండా: 8,న్యూ ఢిల్లీ: 1, ముంబై: 3, లోనావాలా: 1, లైజన్ ఆఫీసర్: 1. దరఖాస్తు ప్రారంభం: 2020 అక్టోబర్ 23, దరఖాస్తుకు చివరి తేదీ: 2020 నవంబర్ 3 మధ్యాహ్నం 2 గంటలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీలను త్వరలో వెల్లడించనున్న ఈసీఐఎల్. విద్యార్హతలు: టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఫుల్టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. లైజన్ ఆఫీసర్ పోస్టుకు ఇండియన్ ఆర్మీలో కల్నల్, లెప్టనెంట్ కల్నల్‌గా రిటైర్ అయిన వారు అర్హులు. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కనీసం 15 ఏళ్లు అనుభవం ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com