50వ నేషనల్ డే కోసం సర్వం సిద్ధం
- October 28, 2020
మస్కట్:సుల్తానేట్ ఆఫ్ ఒమన్, 50వ నేషనల్ డే వేడుకలకోసం సన్నద్ధమవుతోంది. నవంబర్ 18న ఈ వేడుకలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రముఖ హైవేలు, సుల్తాన్ కబూస్ స్ట్రీట్, మస్కట్ ఎక్స్‌ప్రెస్‌వేలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సిల్వర్ జూబ్లీ ఆఫ్ నేషనల్ డే కోసం ఏర్పాట్లు జరుగుతుండడం ఆనందంగా వుందని బురైమి యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ అబూద్ అల్ సావ్‌ఫి చెప్పారు. సౌక్స్, డౌన్‌టౌన్ షాప్స్, రిమోట్ ఏరియాస్‌లోని స్మాల్ గ్రాసరీస్ రంగుల మయం అవుతున్నాయి. కాగా, షాప్‌లలో సేల్స్ కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ అలాగే లేట్ మెజెస్టీ సుల్తాన్ కబూస్ ఫొటోలతో కూడిన బ్యాడ్జీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!