దుబాయ్ లో ప్రతి ఏడాది పెరుగుతున్న పాటశాలల ఫీజులు

- February 14, 2016 , by Maagulf
దుబాయ్ లో  ప్రతి ఏడాది పెరుగుతున్న పాటశాలల ఫీజులు

దుబాయ్ లో  తమ పిల్లలని ప్రైవేటు పాటశాలలో చదివించడం నానాటికి కష్టమైపోతుందని పలువురు తల్లితండ్రులు ఆవేదన చెందుతున్నారు. 2016 - 2017  విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాటశాలల ఫీజులు కనిష్టంగా 3.21 శాతం, గరిష్టంగా 6.42 శాతం వరుకు పెరగనుంది. ఈ పెంపుదల ఆయా  పాటశాలల ప్రమాణాలను బట్టి ఉంటుంది.  ఈ పెరుగుదల నూతన విద్యావ్యయ సూచిక ( ఇ.సి.ఐ.)  2.92  శాతం నుంచి 3.21 శాతం వరుకు పెరుగుతుందని " నాలెడ్జే అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ " ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నూతన విద్యావ్యయ సూచిక ( ఇ.సి.ఐ.) పాటశాలల నిర్వహాణ ఖర్చులను అంచనా వేస్తుంది. వేతనాలు , అద్దెలు , వినియోగదారుల ధరలు వంటి తదితర ఖర్చులను దుబాయ్ గణాంకాల కేంద్రం ప్రతి ఏటా లెక్కిస్తారు. నూతన విద్యావ్యయ సూచిక ( ఇ.సి.ఐ.) ఆధారంగా పాటశాలల తనిఖీ తర్వాత అత్యుత్తమ ప్రమాణాలను బట్టి 6.42 శాతం ఫీజును ఏప్రిల్ లేదా మే నెలలో పెంచవచ్చు.        ' చాలా మంచిది ' అని ఆయా పాటశాలకు అర్హత వస్తే, 5.62 శాతం , ' మంచిది ' అని  ఆయా పాటశాలకు అర్హత వస్తే, 4.82 శాతం ఫీజులను, సాధారణ స్థాయి ఉంటె , 3.21 శాతం వరకు  దుబాయ్ లో  ఆయా పాటశాలల యాజమాన్యం పెంచుకోవచ్చు. తల్లితండ్రుల స్పందన  ప్రైవేటు పాటశాలల యాజమాన్యాలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్న ఈ  ఫీజులు పెంపుదల నిర్ణయం విద్యార్ధుల తల్లితండ్రులకు మింగుడుపడటం లేదు. భారంగా మారిన ఈ ధోరణులపై ' గల్ఫ్ న్యూస్ ' తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. జోర్డాన్ కు  చెందిన 10 సంవత్సరాల విద్యార్ధి తండ్రి హస్సన్ నజీమ్ మాట్లాడుతూ, ఇదే విధంగా ప్రతి ఏడాది  పాటశాలల ఫీజులు క్రమం తప్పకుండా పెరుగుతుంటే, తనలాంటి సామాన్యులు దుబాయ్ లో పిల్లలను చదివించడానికి భయపడతారని పేర్కొన్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com