జనం గుమికూడటంపై నిషేధం, భారీ జరీమానాలు
- October 29, 2020
మస్కట్: ఒమన్ సుప్రీం కమిటీ నిర్వహించిన సమావేశంలో మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ అల్ సీది మాట్లాడుతూ, జనం గుమికూడటం వల్ల కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం వున్నందున, గేదరింగ్స్‌పై నిషేధం కొనసాగుతుందనీ, ఉల్లంఘనులకు భారీ జరీమానాలు విధిస్తామని పేర్కొన్నారు. భారీ జరీమానాలు, పదే పదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, మూసి వున్న ప్రాంతాల్లో గేదరింగ్స్ కొనసాగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు మినిస్టర్. కాగా, కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి 1.8 మిలియన్ డోసుల్ని రిజర్వ్ చేయడం జరిగిందనీ, అయితే ఎప్పటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనేది ఇప్పుడే చెప్పలేమని మినిస్టర్ వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - డిసీజ్ కంట్రోల్ జనరల్ డైరెక్టర్ డాక్టర్ సీఫ్ అల్ అబ్రి మాట్లాడుతూ, ఒమన్‌కి వచ్చేవారికి కరోనా నెగెటివ్ వచ్చినా 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా కొనసాగుతుందని చెప్పారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!