డీఆర్డీఓ హైదరాబాద్ లో ఉద్యోగాలు..

- October 29, 2020 , by Maagulf
డీఆర్డీఓ హైదరాబాద్ లో ఉద్యోగాలు..

హైదరాబాద్:నిరుద్యోగులుకు డీఆర్డీఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికే అనేక నియామకాలు చేపడుతున్న ఈ సంస్థ తాజాగా హైదరాబాద్ లోని డిఫెన్స్ మెటలర్జికల్ లాబరేటరీ(DMRL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 నూతన నియామకాలను చేపట్టారు. వీరిని తాత్కాలిక పద్ధతిలో నియమించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 54 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. మొత్తం 21 పోస్టులలో 18 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు కాగా.. మరో మూడు రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు.

-JRF in metallurgy or material science- ఈ విభాగంలో మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. BE/BTech మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, సంబంధిత సబ్జెక్టుల్లో ఫస్ట్ డివిజన్ లో పాస్ అయిన వారు అర్హులు.
-JRF in physics, JRF in chemistry విభాగాల్లో ఒక్కో పోస్టును భర్తీ చేయనున్నారు. ఆయా కోర్సుల్లో ఫస్ట్ డివిజన్ లో ఎమ్మెస్సీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
-JRF in mechanical ఈ విభాగంలో మొత్తం మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ లో బీ.టెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
-RA in metallurgy or material science ఈ విభాగంలో ఒక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంటెక్ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులు.
-RA in physics, RA in chemistry విభాగాల్లో ఒక్కో పోస్టును భర్తీ చేస్తున్నారు. ఎమ్మెస్సీ ఫస్ట్ డివిజన్ లో పాసై మూడేళ్ల అనుభవం ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇతర వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో చూడవచ్చు.గేట్, యూజీసీ, సీఎస్ఐఆర్-నెట్ లలో మంచి స్కోర్ సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 28 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు వమోపరిమితిని సడలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com