ఎల్.ఇ.డి. బూట్ల ద్వారా విద్యుత్ షాక్ కొట్టదని దుబాయ్ మునిసిపాలిటి వివరణ
- February 15, 2016
ఎల్.ఇ.డి. బూట్ల కారణంగావిద్యుత్ షాక్ కొట్టి పలువురు పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారనే ఇటీవల సామాజిక మాధ్యమంలో ప్రాచుర్యం పొందుతున్న పుకార్లు వట్టివేనని అందులో ఎటువంటి నిజం లేదని దుబాయ్ మునిసిపాలిటి పేర్కొంటుంది. దాదాపు 17 మంది వ్యక్తులు ఎల్.ఇ.డి. బూట్ల కారణంగావిద్యుత్ షాక్ కొట్టి ఆసుపత్రిలో కోలుకుంటున్నారని సోషల్ మీడియాలో అసత్య కధనంలో ఎటువంటి నిజం లేదని తెలియచేసింది. ఈ పుకారులో ఎటువంటి శాస్రీయ ఆధారం గానీ, విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ నిజం ఏమీ లేదని దుబాయ్ మునిసిపాలిటి వివరణ ఇస్తుంది. అంతర్జాలంలో ఈ పుకారు ఎక్కడ నుంచి ప్రాణం పోసుకుందో తెలియడం లేదని వివరిస్తున్నారు .ప్రజారోగ్యం తో ముడి పది ఉన్న ఈ పుకార్లు ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతున్నాయో ప్రజలే శోధించాలని అన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా గానీ ఈ ఎల్.ఇ.డి. బూట్ల కారణంగా ఎటువంటి ప్రమాదాలు నమోదు కాలేదని దుబాయ్ ఆరోగ్య సంస్థ తెలిపింది. సెల్ ఫోన్లో ఉపయోగించే బ్యాటరీ మాదిరిగా ఉన్న బ్యాటరీ సాయంతో విద్యుత్ దీపాలు బూట్ల ముందు వెలిగే వీటికి తగినంత ఛార్జ్ చేస్తే సరిపోతుందని వివరించింది. ఎల్.ఇ.డి. బూట్లను ధరించే పిల్లలను వారి తల్లితండ్రులు పర్యవేక్షిస్తూ ఉండాలని, పిల్లలు వేరే ఇతర ఎలెక్ట్రానిక్ వస్తువులు వాడకుండా చూడాలని కోరారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్‌లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్‌యూవీల రీకాల్..!!
- ఇరాన్‌తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్‌పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్‌లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్‌కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ బేకర్‌కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్‌పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







