దోహా:తనిఖీల పేరుతో ఓవరాక్షన్ చేసిన ఎయిర్ పోర్టు అధికారులపై విచారణకు ఆదేశం

- October 31, 2020 , by Maagulf
దోహా:తనిఖీల పేరుతో ఓవరాక్షన్ చేసిన ఎయిర్ పోర్టు అధికారులపై విచారణకు ఆదేశం

దోహా:విమానాశ్రయంలో తనిఖీల పేరుతో మహిళల పట్ల అతిగా ప్రవర్తించిన ఘటనలో విచారణకు ఆదేశించింది ఖతార్ ప్రభుత్వం. అభ్యంతరకరంగా తనిఖీలు నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ ఘటన అక్టోబర్ మొదటి వారంలోనే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 2న దోహా ఎయిర్ పోర్టు బాత్రూంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ నవజాత శిశువును వదిలివెళ్లారు. ఆ శిశువు అమ్మ ఎవరో నిర్ధారించుకునేందుకు ఆ సమయంలో ప్రయాణించిన 10 విమానాల్లోని మహిళా ప్రయాణికులను పరీక్షించాలని అధికారులు నిర్ధారించి...మహిళా ప్రయాణికుల జననేంద్రియాలను పరిశీలించారు. అయితే..ఈ ఘటన పెను దుమారమే లేపింది. అంతర్జాతీయంగా కూడా పలు దేశాలు దోహా ఎయిర్ పోర్టు అధికారుల తీరును తీవ్రంగా పట్టుబట్టాయి. జననేంద్రియ పరీక్షల బాధితుల్లో తమ దేశానికి చెందిన మహిళ కూడా ఉందని..ఇలాంటి పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని న్యూజిలాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎయిర్ పోర్టు అధికారుల తీరుపై దుమారం రేగడంతో..ఘటనపై స్పందించిన ఖతార్ ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించటంతో పాటు అభ్యంతరకర పరీక్షల పట్ల బాధితులు క్షమాణలు చెప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com