26కు చేరిన టర్కీ భూకంప మృతులు
- October 31, 2020
అంకారా: టర్కీ, గ్రీస్‌ను భారీ భూకంపం కుదిపేసింది. టర్కీలో భూకంపం వల్ల మరణించినవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. నిన్న 14 మంది చనిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరింది. భూకంపం కారణంగా 800 మందికిపైగా గాయపడ్డారు. టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సమోస్‌లోని గ్రీకు పట్టణం కార్లోవాసికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.0గా నమోదయ్యింది. దీని ప్రభావంతో సామోస్, ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ వచ్చింది. టర్కీలోని ఇజ్మిర్‌లో 20కిపైగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శిథిలాల్లో చిక్కుకున్న బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉన్నది.
ఇజ్మిర్ తీరప్రాంతంలోని సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. గ్రీస్ ద్వీపం సామోస్‌కు సమీపంలో 13 కి.మీ. లోతులో భూపంక కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ ప్రకటించింది. గతంలో టర్కీలో భారీగా భూకంపాలు సంభవించాయి. ఈ ఏడాది జనవరిలో ఇలాజిగ్ ప్రావిన్సులో సంభవించిన భూకంపంలో 30 మందికిపైగా మృతి చెందారు. 1600 మందికి పైగా గాయపడ్డారు. 1999లో ఇస్తాంబుల్ సమీపంలోని ఇజ్మిట్ నగరంలో వచ్చిన భూకంపంలో సుమారు 17 వేలమంది కన్నుమూశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు