రాజ్ భవన్ లో ఏక్తా దివాస్.. సర్దార్ పటేల్ కు టి.గవర్నర్ నివాళి

- October 31, 2020 , by Maagulf
రాజ్ భవన్ లో ఏక్తా దివాస్.. సర్దార్ పటేల్ కు టి.గవర్నర్ నివాళి

హైదరాబాద్:భారత తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ 145 జయంతి వేడుకలు పురస్కరించుకుని ఏక్తా దివస్‌ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సర్ధార్ పటేల్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాని నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ దర్బార్ హాల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ చిత్ర పటాన్ని పుష్పమాలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజ్ భవన్ ఆఫీసర్లు, సిబ్బందితో గవర్నర్ రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యతకు, సమగ్రతకు, రక్షణకు పాటుపడతామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ దేశంలోని సంస్థానాలను విలీనం చేసిన ఘనత ఆయనదని కొనియాడారు గవర్నర్. స్వాతంత్ర్య అనంతరం భారత్ ఐక్యతకు సర్ధార్ పటేల్ చేసిన కృషి గవర్నర్ ఈ సందర్భంగా గుర్తుచేసి, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com