తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- November 02, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం...తెలంగాణలో భారీగా కరోనా కేసులు తగ్గిపోయాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 922 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా... 1,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఏడుగురు మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,970 కు చేరుకోగా... ఇప్పటి వరకు 2,21,992 మంది కరోనాబారినపడి తిరిగి కోలుకున్నారు... 1348 మంది మృత్యువాతపడ్డారు... కరోనా మరణాల రేటు భారత్లో 1.5 శాతంగా ఉంటే... రాష్ట్రంలో 0.55 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 91.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.12 శాతంగా ఉందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 17,630 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 14,717 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. నిన్న రాష్ట్రంలో 25,643 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహింంచినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 256 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!







