నవంబర్ 9నుండి `ఆచార్య`షూటింగ్.. 2021 సమ్మర్‌లో విడుదల
- November 04, 2020
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `ఆచార్య`. మెగాస్టార్ 152వ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చిత్రీకరణను పునః ప్రారంభించడానికి చిత్రయూనిట్ సిద్ధమైంది. నవంబర్ 9నుండి `ఆచార్య` షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ పూర్తవుతుంది.
కొరటాల శివ అండ్ టీమ్ కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా స్మూత్‌గా షూటింగ్‌ను పూర్తి చేయడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.
మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగినట్లు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సురేశ్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!