మెట్రోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్
- November 05, 2020
హైదరాబాద్:జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు.పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు.
ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్ లో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. ద్రాక్షారామం చెందిన శ్రీ చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవలి వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది మీ అభిమానులు ఉన్నారు.. ఈ ప్రయాణంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు. ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు ఉన్నారు.
తాజా వార్తలు
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!
- ఆస్తమా పై అవగాహనకు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కార్యాచరణ..!!
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ









