హైదరాబాద్ లో ముమ్మరంగా జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ - మేయర్ బొంతు రామ్మోహన్
- November 06, 2020
హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించేందుకు మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. దీనిలో భాగంగా శుక్రవారం మెహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...నగరంలో వర్షాల వల్ల వచ్చిన శానిటేషన్ ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ డ్రైవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మొబైల్ యాప్ లో అధికారులు ప్రస్తుతం అక్కడి పరిస్థితులు, వర్క్ కంప్లీట్ అయిన తరువాత పరిస్థితుల ఫోటోలను అప్ లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుధ్య యంత్రాంగం వరదలు వచ్చిన ప్రాంతాల్లో పనిచేయడంతో ఇతర ప్రాంతాల పారిశుధ్యంపై ప్రభావం పడిందని తెలిపారు. ప్రస్తుతం శాటినేషన్ విభాగంలో పనిచేస్తున్న 20వేల మంది సిబ్బందితో పాటు మలేరియా విభాగం కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో ఉన్న వాహనాలు కలుపుకోని మొత్తం 778 వాహనాలతో 4,500 మందితో ప్రత్యేక మ్యాన్ పవర్ ను సమీకరించుకొని ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. నగరంలో పారిశుద్యాన్ని మెరుగు పరుచడంతోపాటు దోమల నివారణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని, మరో 30వేల మెట్రిక్ టన్నుల చెత్త ను తొలగించాల్సి ఉందని మేయర్ తెలిపారు. అనంతరం ఐ.టి.ఐ ఇనిస్టిట్యూట్ లో ఉన్న నీటిగుంటలో గంబూజియా చేపలు వదిలి, మురుగు నీటి కాలువలో ఆయిల్ బాల్స్ మేయర్ వదిలారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..