హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తంచేసిన ఆర్జీవీ
- November 06, 2020
హైదరాబాద్:'మర్డర్' సినిమా విడుదల నిలిపివేయాలని నల్లగొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టివేయడంపై ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హర్షం వ్యక్తంచేశాడు. మర్డర్ సినిమా తీయడం వెనుక ఉన్న మా ఉద్దేశాన్ని గౌరవనీయులైన న్యాయమూర్తి అర్థం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ట్వీట్ చేశాడు. తీర్పునకు సంబంధించిన మొత్తం సమాచారం మా వద్దకు వచ్చిన తర్వాత సినిమా అప్ డేట్ ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు అని' తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా 'మర్డర్' సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ సినిమా ప్రకటన అనంతరం ప్రణయ్ కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ నల్లగొండ కోర్టును ఆశ్రయించారు. దీంతో సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ చిత్ర యూనిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు స్టే ఆర్డర్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







