వినియోగదారుల రద్దీని తట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ గడువును పొడిగంచిన సౌదీ

- November 07, 2020 , by Maagulf
వినియోగదారుల రద్దీని తట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ గడువును పొడిగంచిన సౌదీ

 సౌదీ:షాపింగ్ మాల్స్ లో వినియోగదారుల రద్దీని తగ్గించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. పరిమితి సమయ వేళలతో షాపింగ్ మాల్స్ సీజన్ సేల్స్ కు విపరీతమైన గిరాకీ ఉంటోంది. దీంతో సీజనల్ సేల్స్ గడవును పెంచుతున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజనల్ సేల్స్ గడువు పెంచటం ద్వారా మాల్స్ లో వినియోగదారుల రద్దీని నియంత్రించొచ్చని మంత్రిత్వ శాఖ చెబుతోంది. అంతేకాదు..ప్రస్తుత పరిస్థితుల ప్రభావం కారణంగా వార్షిక అమ్మకాల లోటును కూడా అదనపు గడువు ద్వారా భర్తీ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొంది. ఇదిలాఉంటే..షాపింగ్ మాల్స్ లో కోవిడ్ 19 నిబంధనల్ని ఖచ్చితంగా పాటించి తీరాలని మంత్రిత్వ శాఖ మరోసారి హెచ్చరించింది. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ట్రాలీలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించింది. మంత్రిత్వ శాఖ సూచించిన నిబంధనలను ఉల్లంఘిస్తే SR10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది.   వినియోగదారులు, మాల్స్ సిబ్బందికి ఎంట్రన్స్ దగ్గరే టెంపరేచర్ చెక్ చేయాలని పేర్కొంది. మాల్స్ లోగానీ, వెలుపలగానీ జనం గుమికూడకుండా చూసుకోవాలని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 మందికి మించకూడదని వెల్లడించింది. ఈ నిబంధనల్లో ఉల్లంఘనకు పాల్పడితే R50,000 జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com