కువైట్ ఆయిల్ కార్పొరేషన్లో 99 శాతం పౌరులు
- November 07, 2020
కువైట్ సిటీ:కువైట్ పౌరుల సంఖ్య కువైట్ ఆయిల్ కార్పొరేషన్లో 99 శాతంగా వుందని ఆయిల్ మినిస్టర్ ఖాలెద్ అల్ ఫదెల్ వెల్లడించారు. మొత్తం 681 మంది కువైటీ ఎంప్లాయీస్ టెక్నికల్ జాబ్స్ చేస్తున్నారనీ, వలసదారుల సంఖ్య ఈ విభాగంలో కేవలం 26 మాత్రమేననీ, అది కూడా లోకల్ మార్కెట్లో అందుబాటులోని ఎక్సపర్టైజేషన్ విభాగంలోనే వలసదారులున్నారని ఆయన వివరించారు. కాగా, మార్జినల్ మరియు ఆగ్జిలరీ జాబ్స్‌లో 148 కాంట్రాక్ట్ నాన్ కువైటీలు పనిచేస్తున్నారు. కువైటీ నేషనల్స్ చేయడానికి చాలా కష్టమైన విభాగంలో వలసదారులు పనిచేస్తున్నట్లు మినిస్టర్ పేర్కొన్నారు. 2017 నుంచి 38 వలస ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ల్ని కార్పొరేషన్ ముగించినట్లు చెప్పారు. అప్పటినుంచి 72 మంది కువైటీలను అపాయింట్ చేశారు కార్పొరేషన్లో. కువైట్ జనాభా 4.8 మిలియన్ కాగా, అందులో విదేశీయుల సంఖ్య 3.4గా వుంది. విదేశీయుల సంఖ్య తగ్గించేలా కువైటీలకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







