కరోనా ట్రీట్మెంట్ నిలిపేశారంటూ ప్రచారం..రూమర్స్ గా కొట్టి పారేసిన అధికారులు

- November 08, 2020 , by Maagulf
కరోనా ట్రీట్మెంట్ నిలిపేశారంటూ ప్రచారం..రూమర్స్ గా కొట్టి పారేసిన అధికారులు

మస్కట్: ఒమన్ లోని కొన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ 19 డిపార్ట్మెంట్ ను మూసివేశారని, ఇక కరోనా ట్రీట్మెంట్ చేయరంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ సమాచార కేంద్రం కొట్టిపారేసింది. సుల్తానేట్ పరిధిలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్సను పూర్తిగా నిలిపివేశారని, ఇక నుంచి కోవిడ్ వార్డులో పేషెంట్లను చేర్చుకోరంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రభుత్వ యంత్రాంగం వరకు వెళ్లటంతో కోవిడ్ ట్రీట్మెంట్ కు సంబంధించి ప్రభుత్వ సమాచార కేంద్రం స్పష్టతను ఇచ్చింది. సుల్తానేట్ పరిధిలో ట్రీట్మెంట్ నిలిపివేశారని చెబుతున్న ప్రచారంలో నిజం లేదని, మిగిలిన ఆస్పత్రుల తరహాలోనే ఆ ఆస్పత్రిలో కూడా కోవిడ్ పేషెంట్లను చేర్చుకొని చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com