బాగ్దాద్ మీద ఐసిస్ దాడి.. 11 మంది మృతి
- November 09, 2020
బాగ్దాద్: ఐసిస్ గ్రూప్ కు చెందిన ఉగ్రవాదులు బాగ్దాద్ లోని ఓ లుక్ అవుట్ పాయింట్ మీద దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు. బాగ్దాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరలో ఉన్న రద్వానియా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్లను విసిరారు. హాషెద్ రక్షణ బృందాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. మానిటరింగ్ టవర్ మీద మొదట కాల్పులకు తెగబడ్డారు.
దీంతో 5 మంది ట్రైబల్ హాషెద్ బృందానికి చెందిన సభ్యులు మరణించారు. హాషెద్ బృందానికి సహాయం చేయడానికి వచ్చిన ఆరుగురు స్థానికులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఎనిమిది మంది గాయపడిన వారిని సెంట్రల్ బాగ్దాద్ లోని ఆసుపత్రికి తరలించారు.
ఇరాక్ మీద ఐసిస్ గతంలో పట్టు సాధించింది. 2014లో ఇరాక్ లోని చాలా భాగం ఐసిస్ ఆధీనంలో ఉండేది. చాలా నగరాలు ఐసిస్ గుప్పిట్లో పెట్టుకుని మారణహోమం సృష్టించాయి. కానీ అమెరికా దళాలతో కలిసి ఇరాక్ ఐసిస్ ను అంతం చేసే కార్యాచరణ రూపొందించింది. 2017 సంవత్సరంలో ఇరాక్ నుండి ఐసిస్ ను తుదముట్టించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!