వలసదారుల ఇ-బిజినెస్ నిషేధంపై భిన్నమైన స్పందన
- February 16, 2016
ఇండస్ట్రీ, కామర్స్ నఅండ్ టూరిజం మినిస్ట్రీ, బహ్రెయిన్‌లో ఆన్‌లైన్ బిజినెస్ చేస్తున్న వలసదారుల్ని బ్యాన్ చేయడంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నిర్ణయం ద్వారా, ఆ బిజినెస్‌పై ఆధారపడిన వలసదారులు, బహ్రెయిన్‌ని విడిచిపెట్టే అవకాశం ఉందనీ, అది దేశంలోని అన్ని బిజినెస్‌లపైనా ఎంతోకొంత ప్రభావం చూపుతుందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అధికార వర్గాలు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాయి. ఎలాంటి లైసెన్సులూ లేకుండా, ఆఖరికి సరైన అడ్రస్ లేకుండా చేపడ్తున్న ఈ వ్యాపార కార్యకలాపాలు అనైతిక చర్యలకు ఆస్కారం కల్పిస్తాయని అధికారులు చెప్పారు. ఇంకొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. ఇది మంచి నిర్ణయమని కొనియాడారు. స్థానిక వ్యాపారులు లైసెన్సులు పొంది, తమ వ్యాపారాలను ఇ-బిజినెస్ ద్వారా చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేయడం జరిగింది. వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన బిజినెస్ జరుగుతోంది. ఈ రంగంపై 'బ్యాన్' నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







