దీపావళికి టపాకాయలు కాల్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పిన డా.మురళీధర్ రామప్ప
- November 10, 2020
దీపావళి కాంతులు, శబ్దాల పండగ. బాణాసంచా కాల్చేటప్పుడు చిన్న పిల్లలను పెద్దవాళ్లు ఒకరు పర్యవేక్షించాలి. దీపావళికి మీరు టపాకాయలు కాల్చానుకుంటే దయచేసి ఈ క్రింది జాగ్రత్త లు తీసుకోండి.
చేయవలసినవి:
· అనుమతి ఉన్నవారినుంచే టపాకాయలు కొనండి. వాటిని 2 రోజులు ఎండబెట్టండి.
· టపాకాయలను పిల్లలకు మరియు గ్యాస్ సిలండర్ లేదా నూనె డబ్బావంటి మండే పదార్దాలకు దూరంగా అట్టడబ్బాలో భద్రపరచండి.
· టపాకాయలతో ఆడుకునేటప్పుడు పిల్లలను ఒంటరిగా వదలకండి.
· ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే టపాకాయలను కాల్చాలి. మిగిలినవారు దూరంగా నిలబడి చూడాలి.
· ఆరుబయటి ప్రదేశంలో టపాకాయలు కాల్చాలి.
· టపాకాయలు కాల్చడానికి కేవలం ఒక పొడుగు కొవ్వత్తి లేదా కాకరపువ్వొత్తిని ఉపయోగించాలి.
· అందుబాటులో రెండు బకెట్లలో నీళ్లు ఉంచుకోండి. ఎవరికైనా కాలితే, కాలిన చోట బాగా నీళ్లు పొయ్యండి.
· ఎక్కువగా కాలితే మంట ఆర్పిన తరువాత ఆ వ్యక్తిని శుభ్రంగా ఉన్న దుప్పటిలో చుట్టి ఆసుపత్రికి తీసుకువెళ్లండి.
· ఒకవేళ కన్నుకు గాయమైతే 10 నిమిషాలపాటు నీళ్ళతో కడిగి ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న కంటి ఆసుపత్రికి వెంటనే తీసుకువెళ్లండి.
చేయకూడనివి :
· టపాకాయలను చేతిలో పట్టుకుని కాల్చకండి.
· టపాకాయలు కాల్చేటప్పుడు వాటిమీద వంగకండి.
· సీసా, రేకు డబ్బా లేదా బోర్లించిన కుండవంటి పాత్రలో పెట్టి టపాకాయలను కాల్చకండి. అది చాలా ప్రమాదం కావచ్చు.
· వెంటనే కాలని టపాకాయలకు దగ్గరకు వెళ్లేముందు కొంతసేపు ఆగండి.
· మిగిలిపోయిన టపాకాయను ఏరి మీ స్వంత టపాకాయలను తయారు చేయకండి.
· మీ జేబులో టపాకాయలను పెట్టుకోకండి.
· కాలుతున్న కొవ్వొత్తులు, దీపాలు లేదా అగరువత్తుల దగ్గర వాటిని దాచకండి.
· టపాకాయలు కాల్చేటప్పుడు నైలాను దుస్తులు వేసుకోకండి. కేవలం మందంగా ఉండే నూలు దుస్తులు మాత్రమే వేసుకోండి.
· బాగా వదులుగా ఉన్న దుస్తులు వేసుకోండి, బట్టలను సరిగ్గా ఉంచుకోండి.
· కాలిన చోట క్రీము లేదా ఆయింట్మెంట్ లేదా నూనె రాయకండి.
· గాలి ఎక్కువగా ఉన్నట్లయితే, పైకి ఎగిరే టపాకాయలను కాల్చకండి.
డా.మురళీధర్ రామప్ప,
సీనియర్ కార్నియా కన్సల్టెంట్,
ఎల్ వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్,హైదరాబాద్
తాజా వార్తలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్‌కు ఫ్లిప్పరాచి..!!
- ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్







