అశ్రునయనాలతో వీర జవాన్‌ మహేష్ అంతిమయాత్ర

- November 11, 2020 , by Maagulf
అశ్రునయనాలతో వీర జవాన్‌ మహేష్ అంతిమయాత్ర

నిజామాబాద్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ వీర జవాన్ మహేష్ అంతిమయాత్ర అశ్రునయనాలతో ప్రారంభమైంది. అనంతరం వేల్పూర్‌ మండలం, కోమన్‌పల్లిలో వీరజవాన్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంతిమ యాత్రలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ అరవింద్‌, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, కలెక్టర్‌ నారాయణరెడ్డి, కోటపాటి నరసింహం నాయుడు(అధ్యక్షులు రాష్ట్ర పసుపురైతులు),ఏముల రమేష్(అధ్యక్షులు -MRWF), రత్నగిరి, వంశీ గౌడ్ ఉపాధ్యక్షులు GWAC మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ వీర జవాన్ మహేష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్‌ మండలం, కోమన్‌పల్లి గ్రామానికి బుధవారం తెల్లవారుజామున మహేష్ మృత దేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. మహేష్ పార్థివదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జయహో జవన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం మహేష్ మృతదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహేష్ కుటుంబాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ శర్మ పరామర్శించారు. అంత్యక్రియ ఏర్పాట్లను ఆర్మీకి చెందిన మద్రాస్ రీజ్‌మెంట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com