అశ్రునయనాలతో వీర జవాన్ మహేష్ అంతిమయాత్ర
- November 11, 2020
నిజామాబాద్: ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ వీర జవాన్ మహేష్ అంతిమయాత్ర అశ్రునయనాలతో ప్రారంభమైంది. అనంతరం వేల్పూర్ మండలం, కోమన్‌పల్లిలో వీరజవాన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంతిమ యాత్రలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ అరవింద్, జడ్పీ ఛైర్మన్ విఠల్‌రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, కోటపాటి నరసింహం నాయుడు(అధ్యక్షులు రాష్ట్ర పసుపురైతులు),ఏముల రమేష్(అధ్యక్షులు -MRWF), రత్నగిరి, వంశీ గౌడ్ ఉపాధ్యక్షులు GWAC మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ వీర జవాన్ మహేష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం, కోమన్‌పల్లి గ్రామానికి బుధవారం తెల్లవారుజామున మహేష్ మృత దేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. మహేష్ పార్థివదేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జయహో జవన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం మహేష్ మృతదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహేష్ కుటుంబాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ శర్మ పరామర్శించారు. అంత్యక్రియ ఏర్పాట్లను ఆర్మీకి చెందిన మద్రాస్ రీజ్మెంట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







