హోవర్‌ బోర్డ్స్‌ని నిషేధించిన దుబాయ్‌

- February 16, 2016 , by Maagulf
హోవర్‌ బోర్డ్స్‌ని నిషేధించిన దుబాయ్‌

దుబాయ్‌ సిటీలో హోవర్‌ బోర్డ్‌సని నిషేధించారు. ఈ నిర్ణయంతో సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ స్కూటర్స్‌ని ఇప్పటికే బ్యాన్‌ చేసిన న్యూయార్క్‌, నెథర్‌లాండ్స్‌, యూకే, హాంగ్‌కాంగ్‌, న్యూ సౌత్‌ వేల్స్‌, ఆస్ట్రేలియా సరసన దుబాయ్‌ చేరింది. పబ్లిక్‌ ప్రాంతాల్లో హోవర్‌ బోర్డ్స్‌ని బ్యాన్‌ చేస్తున్నట్లు దుబాయ్‌ మున్సిపాలిటీ వర్గాలు ప్రకటించాయి. రద్దీగా వుండే ప్రాంతాల్లో, సైడ్‌ వాక్స్‌లో, రోడ్స్‌ మరియు ఇతర పబ్లిక్‌ ప్రాంతాల్లో హోవర్‌ బోర్డుల్ని నిషేధించినట్లు పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌, మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్‌ సుల్తాన్‌ అల్‌ సువ్వాది చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కుల్లో మాత్రమే హోవర్‌ బోర్డుల్ని వినియోగించాలి. హోవర్‌ బోర్డ్స్‌ వినియోగించేటప్పుడు చేతికి, తలకి, మోకాళ్ళకీ తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. తయారీ కంపెనీ సూచనల మేరకు ఛార్జింగ్‌ చేయవలసి ఉంటుందనీ, భద్రత విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులు చెప్పారు. హోవర్‌ బోర్డ్‌పై పయనిస్తూ రోడ్డుపై వెళ్ళే కారు ఢీ కొని ఆరేళ్ళ కుర్రాడు అబుదాబీలో చనిపోవడంతో అప్పటినుంచీ హోవర్‌ బోర్డ్‌పై నిబంధనల్ని కఠినతరం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com