తిరుమల ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం
- November 11, 2020
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక ఎస్వీబీసీ ఛానెల్ లో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. దీనికి జవాబుగా ఆ భక్తుడికి పోర్న్ సైట్ వీడియో లింక్ వచ్చింది. ఎస్వీబిసి ఉద్యోగి నుండి లింక్ రావడంతో ఆ భక్తుడు ఖంగుతిన్నాడు. దీనిపై వెంటనే టిటిడి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు ఈఓ జవహర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై భక్తుడి నుండి ఫిర్యాదు రావడంతో టీటీడీ చైర్మైన్, ఈవో తీవ్రంగా స్పందించారు. వెంటనే ఎస్వీబీసీ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేశారు. టిటిడి విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఇతర అధికారులందరూ కలసి ఎస్వీబీసీలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. భక్తుడికి పోర్న్ సైట్ వీడియో లింక్ పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో పోర్న్ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించింది సైబర్ క్రైమ్ టీం. కార్యాలయంలో విధులు నిర్వహించకూండా ఇతర వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించారు. విధులు నిర్వహించకుండా వృధాగా కాలం గడుపుతున్నారని భాధ్యుల పై చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోంది ఎస్వీబీసీ యంత్రాంగం.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







