బాప్స్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా ఆలయ పనులు..దివాళీ వేడుకలు ఏర్పాట్లు
- November 11, 2020
అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబిలో నిర్మిస్తున్న తొలి హిందూ దేశాలయం పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఒడిదుడుకులు నెలకొన్నా...ఆ అవాంతరాలను అన్నింటిని అధిగమించి అలయాన్ని అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు బోచాసంవాశి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ(బాప్స్) ప్రతినిధులు తెలిపారు. మందిరానికి సంబంధించి మాస్టర్ ప్లాన్స్ డిజైన్లు ఈ ఏడాది తొలినాళ్లలోనే పూర్తి అయిన విషయం తెలిసిందే. మందిర పనుల్లో విశిష్టంగా చెబుతున్న ప్రకారాలు, రాతి నిర్మాణానికి సంబంధించి ఇటాలియన్ మార్బుల్, రాజస్థాని ఇసుకరాతితో ఇప్పటికే 25,000 క్యూబిక్ అడుగుల మేర సుందరమైన శిల్పాలు సిద్ధమయ్యాయి. ఇదంతా తొలిదశలో భాగం. తర్వాతి దశలో భాగంగా శిల్పాలను ఆలయ ప్రాంగణానికి తెప్పించి వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి అమర్చనున్నారు. ఈ పనులను ప్రారంభించేందుకు బాప్స్ సంస్థ ప్రిన్సిపల్ ఇంచార్జ్ పూజ్య బ్రహ్మవిహారిదాస్ స్వామి యూఏఈ విచ్చేసారు. యూఏఈలో కరోనా నిబంధనలకు కట్టుబడుతూనే ఆలయ నిర్మాణానికి అవాంతరాలు రాకుండా భారత్ లో శిల్పాల పనులు కొనసాగిస్తున్నట్లు బాప్స్ హిందూ ఆలయ అధికార ప్రతినిధి అశోక్ కొటేచా వెల్లడించారు. సుందర ఆకృతిలో చెక్కిన శిల్పాలను అబుధాబిలోని ఆలయ ప్రాంగణానికి రవాణా చేయటంలో ఎంతో సహాయం చేస్తున్న డీపీ వరల్డ్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆలయంలో అతి కీలకమైన మండోవర్ నిర్మాణం. ఈ నిర్మాణంలో విశిష్టతలు ఉన్నాయి. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతితో పాటు గల్ఫ్ నిర్మాణ శైలి సమ్మేళితమై ఉంటుంది. ఈ ఆలయంలో శిల్పకళ ఎంతో విభిన్నమైనదిగా రూపుదిద్దుతున్నారు. భవిష్యత్ తరాలకు భారత సంస్కృతిక వారసత్వాన్ని అందించేలా రాతి శిల్పాలపై భారత భౌగోళిక స్వరూపం, హిందూ ధర్మంపై కథలను పొందుపరిచారు. ఇందులో మహాభారతం, రామాయణంతో పాటు పురాణాలు, ప్రాంతీయ చరిత్రలు ఉన్నాయి. ఇండియా, యూఏఈ ప్రభుత్వాల మార్గనిర్దేశకత్వంలో పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పనులు నిలిచిపోకుండా జరిగేలా విశేష సహకారాన్ని అందిస్తున్న భారత్, యూఏఈ ప్రభుత్వాలకు కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఇదిలాఉంటే..ఆలయ పనులను నిర్విరామంగా జరిగేలా చిత్తశుధ్ధితో కృషి చేస్తున్న బాప్స్ హిందూ మందిర్ నిర్వాహకులు.. యూఏఈలో దిపావళి సంబరాలకు అవాంతరాలు లేకుండా నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. అయితే..కోవిడ్ నిబంధనల నేపథ్యంలో వర్చువల్ దివాళి నిర్వహించేలా ఆలయ కమిటీ కృషి చేస్తోంది. అదేవిధంగా హిందూ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా కసరత్తు చేస్తోంది.
_1605095052.jpg)
_1605097474.jpg)



_1605095251.jpg)

తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







