హరీష్ రావు పొలిటికల్ ఇమేజ్ కు దుబ్బాక మచ్చ..!ఇంతకీ ప్రజల్లో టాక్ ఏంటి?
- November 11, 2020
దుబ్బాకలో హరీష్ రావు ఫెలయ్యాడా? ఫేయిల్ అయ్యేలా చేశారా? ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత పబ్లిక్ లో ఎక్కువగా నానుతున్న టాపిక్ ఇది. పోల్ ఎక్స్ పర్ట్ గా పేరున్న హరీష్ రావు దుబ్బాకను ఇజ్జత్ కా సవాల్ గా తీసుకున్నారు. అయినా..ఓటమి తప్పలేదు. దీంతో ట్రబుల్ షూటర్ పార్టీ వ్యవహారాల పరంగా తొలిసారిగా ట్రబుల్ లో పడిపోయారు. కానీ, ప్రజలు మాత్రం దుబ్బాకలో ఓడింది టీఆర్ఎసేగానీ...హరీష్ రావు కాదనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణలో తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ కు దుబ్బాక ఫలితం ముల్లులా గుచ్చుతోంది. అధికారం ఉంది. ఆర్ధికంగానూ బలంగా ఉంది. వీటన్నింటికి మించి సంక్షేమ పథకాలతో ప్రజలను మెప్పించిన ట్రాక్ రికార్డ్ ఉంది. పైగా ఉప ఎన్నికలను అవలీలగా గెలిపించగలిగే హరీష్ రావు ఉన్నారు. అయినా..దుబ్బాకలో అధికార పార్టీ ఈక్వేషన్ లెక్క తప్పింది. అన్ని సానుకూలంగానే ఉన్నా..లోపం ఎక్కడ ఉంది? ఎందుకు తేడా కొట్టింది? ఈ ప్రశ్నలకుసమాధానాలు వెతుక్కునే పనిలో ఉంది టీఆర్ఎస్. దీనిపై పార్టీ వర్గాల్లోనూ వేర్వేరు వాదనలు షురు అయ్యాయి. ఉప ఎన్నికలను తన భుజాల మీద వేసుకున్న హరీష్ రావు మాత్రం ఓటమికి తనదే బాధ్యత అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
అయితే..ప్రజల్లో మాత్రం టాక్ ఇందుకు భిన్నంగా వినిపిస్తోంది. అసలు హరీష్ రావు బరిలోకి దిగాడు కాబట్టే ఈ మాత్రమైనా ఫైట్ ఇవ్వగలిగిందని విశ్లేషించుకుంటున్నారు. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం హరీష్ రావుకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. అఫ్ కోర్స్ అదంతా ఓ పొలిటికల్ గేమ్ కావొచ్చు. హరీష్ రావుకు సింపతి పెంచి కేసీఆర్ కు వ్యతిరేకతను అపాదించే జిమ్మిక్కులు కూడా ఇమిడి ఉండవచ్చు. పొలిటికల్ కాలుక్యులేషన్స్ ఎలా ఉన్నా..పబ్లిక్ లో మాత్రం హరీష్ రావు ఇమేజ్ కు ఇప్పట్లో వచ్చే నష్టమేమి లేదనే ఫీలింగ్ కనిపిస్తోంది. అధికార పార్టీ పైకి సానుకూలత అంశాలను చూపించినా..క్షేత్రస్థాయిలో మాత్రం అంతా డొల్లే అని అంటున్నారు. అసలు సుజాతకు టికెట్ ఇవ్వటంలో బ్లండర్ జరిగినట్లు చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా పదవిలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సానుభూతి ఉంటుంది. ఎన్నికల్లో ఆ సానుభూతి ఓట్లుగా మారుతాయి. కానీ, దుబ్బాకలో మాత్రం పరిస్థితి విభిన్నం. దివంగత రామలింగారెడ్డి కుటుంబం కంటే..వరుస ఓటముల పాలైన రఘునందన్ వైపే సానుభూతి ఎక్కువగా కనిపించింది.పైగా రఘునందన్ కు తెలంగాణ ఉద్యమకారుడిగా, పోరాటపటిమ గల వ్యక్తిగా పేరుంది. ఇటు చూస్తే...టీఆర్ఎస్ అభ్యర్ధిగా నిలబడిన సుజాత కనీసం తనకు తానుఓట్లను కూడా అభ్యర్ధించలేని దీనస్థితి. ఇక ఆమె కుమారుడికి నియోజకవర్గం అంతటా చెడ్డపేరే ఉంది. అందుకే అతన్ని ప్రచారానికి దూరంగా పెట్టారు. వీటన్నింటికితోడు సొంత పార్టీలోనే సుజాత కుటుంబంపై వ్యతిరేకత వ్యక్తం అయింది. అయితే..పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించటం...ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ దుబ్బాకఉప ఎన్నికల్లో తానే నిలబడినంతగా కలియతిరిగారు హరీష్ రావు. ఆయన ఇంతలా చొరవ తీసుకోవటం వల్లే టీఆర్ఎస్ చివరి వరకు రేసులో నిలబడగలిగిందని స్థానిక ప్రజలే అంటున్నారు. దీనికితోడు కరోనా కాలంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు ఊరటనివ్వాల్సిన ప్రభుత్వం...ఎల్ఆర్ఎస్ అంటూ జనం బీరువాలోని డబ్బులనుప్రభుత్వ ఖజానాకు మళ్లించే ప్రయత్నం చేసింది. పట్టుబట్టి సన్నబియ్యం సాగు చేయించింది. వీటికి తోడు దుబ్బాక చూట్టూర ఉన్న గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజవర్గాలను అభివృద్ధి చేసి తమను వదిలేశారనే అపవాదు కూడా ప్రభుత్వంపై ఉంది. పద్మవ్యూహంలోని అభిమన్యుడిని పంపించినట్లు..ఇన్ని ప్రతికూలతల మధ్య దుబ్బాకకు హరీష్ రావును పంపించారనేది పబ్లిక్ వాదన. దీనికితోడు రేపో మాపో కేటీఆర్ కు పట్టాభిషేకం చేయబోతున్నారని, అందుకు హరీష్ రావు అడ్డుగా మారకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తపడుతున్నారనే లాజిక్ కూడా ఉంది. అందుకే దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడినా..హరీష్ రావు ఇమేజ్ కు మాత్రం ఇప్పట్లో వచ్చే ఢోకా ఏం లేదంటున్నారు. అయితే..రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ సక్సెస్ అయితే మాత్రం హరీష్ రావుకు ఇబ్బంది తప్పకపోవచ్చు.
--- శ్రవణ్ కుమార్, మాగల్ఫ్ ప్రతినిధి, హైదరాబాద్
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







