యూఏఈ గోల్డెన్ వీసా కొరకు ఇలా దరఖాస్తు చేసుకోండి..

- November 16, 2020 , by Maagulf
యూఏఈ గోల్డెన్ వీసా కొరకు ఇలా దరఖాస్తు చేసుకోండి..

యూఏఈ ప్రవేశపెట్టిన 10 సంవత్సరాల గోల్డెన్ రెసిడెన్సీ వీసా కొరకు ఎవరు అర్హులో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీసా కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం..

గోల్డెన్ వీసా వ్యవస్థలో భాగమైన బిజినెస్ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని మీరు ప్లాన్ చేస్తే, మీరు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ను సందర్శించవచ్చు.

యూఏఈ లో వ్యాపార కార్యకలాపాలను ఏర్పాటు చేయాలనుకునే ప్రవాస పారిశ్రామికవేత్తలకు శాశ్వత నివాసం కల్పిస్తుంది బిజినెస్ గోల్డ్ వీసా. ఈ బిజినెస్ గోల్డెన్ వీసా కోసం ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవాలి..

1 - https://business.goldenvisa.ae/register లో నమోదు చేసుకోవడానికి మీరు మీ ఇమెయిల్ ను నమోదు చేసి పాస్‌వర్డ్‌ను సృష్టించాలి.
2 - వీసా కోసం సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. మీ దరఖాస్తును అధికారులు సమీక్షించి,  దరఖాస్తును సమర్పించిన సమయం నుండి 30 రోజుల్లో ఫలితాన్ని మీ ఇమెయిల్ కు   తెలియజేయటం జరుగుతుంది.
3 - మీ దరఖాస్తు ఆమోదించబడిన తరువాత, వీసా కొరకు సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయడానికి మీకు ఇమెయిల్ ద్వారా పంపబడిన లింక్‌ను ఉపయోగించాలి.
4 - అధికారులు మీ దరఖాస్తును ధృవీకరించిన తదుపరి మీకు వీసా మంజూరు చేయబడుతుంది.

లేబర్ మార్కెట్ లో స్వదేశీయులకు ప్రధాన్యత ఇస్తున్న యూఏఈ...
టెక్నాలజీ పరంగా మాత్రం ప్రతిభావంతులైన విదేశీయులకు స్వాగతం పలుకుతోంది. వృత్తి నిపుణులకు ప్రధాన్యత ఇస్తూ పదేళ్ల గోల్డెన్ రెసిడెన్సీ వీసాలను ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఉన్నత విద్యావంతులకు కూడా పదేళ్ల రెసిడెన్సీ వీసాలను ఇచ్చేందుకు యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ మక్తూమ్ అనుమతి ఇచ్చారు. డాక్టర్లు, సాఫ్ట్ వేర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు గోల్డెన్ రెసిడెన్సీ వీసాలు ఇవ్వనున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్ రంగంలో నిపుణులను కూడా యూఏఈ స్వాగతిస్తోంది. ఏఐలో డిగ్రీ చేసిన వారికి పదేళ్ల రెసిడెన్సీ వీసా ఇస్తామని తెలిపింది. ఇక పీహెచ్డీ చేసిన యువత, అధికారిక అనుమతి ఉన్న ఏదైనా యూనివర్సిటీలో 3.8 కు మించి స్కోరింగ్ చేసిన విద్యార్ధులకు కూడా గోల్డెన్ రెసిడెన్సీ పొందవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com