ఈ ఏడాది దుబాయ్ లో రెండు నూతన ప్రైవేటు పాటశాలలు
- February 17, 2016
ఈ ఏడాది దుబాయ్ లో రెండు నూతన ప్రైవేటు పాటశాలలు ప్రారంభం కానున్నాయి. జి.ఇ.ఎం.ఎస్. భారతీయ వారసత్వ పాటశాల, ఫొర్తెస్ ఎడ్యుకేషన్ బ్రిటిష్ విద్యా ప్రణాళిక సున్మర్కే పాటశాలను సెప్టెంబర్లో మొదలుకానుంది. జి.ఇ.ఎం.ఎస్. భారతీయ వారసత్వ పాటశాల అల్ బర్ష ప్రాంతంలో ఉంది. ఇది నిర్మాణం కాగానే, 10 వేలమంది విద్యార్ధులు ఇక్కడ చదువుకోనేందుకు పూర్తిగా సరి పోయేందుకు తీర్చిదిద్దుబడుతున్నఈ పాటశాల ' నాలెడ్జే అండ్ హ్యూమన్ డేవలపమేంట్ అథారిటీ ' చేత ఆమోదించబడింది. ఇక్కడ వార్షిక ఫీజు 14 వేల దినార్ల నుంచి 24 వేల దినార్ల వరకు ఉంటుంది. అలాగే,ప్రతిభ ఉన్న విద్యార్ధులకు ఉపకార వేతనాలను అందచేస్తుంది. ఈ పాటశాలకు స్వంత ఆధునిక
సాంకేతిక కార్యక్రమం ఉంది. అలాగే విద్యార్దులను మంచి క్రీడాకారులుగా రూపొందించేందుకు ఓకే క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేశారు.దీని ద్వారా విద్యార్దులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారిన్ ఉత్తమ క్రీడాకారులుగా జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్తాయికి ఎదిగేందుకు కృషి చేయనుంది అలాగే ,జి.ఇ.ఎం.ఎస్. భారతీయ వారసత్వ పాటశాలలో విద్యార్ధులలో పలు విషయాలపై చర్చావేదికలను నిర్వహించి వారిలోని కళాత్మక నైపుణ్యాలను వెలికితీయనున్నారు. జి.ఇ.ఎం.ఎస్. భారతీయ వారసత్వ 2016 లో నూతన మిలినీయం పాటశాలను అబుదాబీ లోమో విస్తరించనున్నారు. అలాగే, 2017 లో మరో సి.బి.ఎస్.ఇ. పాటశాలను షార్జా లో ప్రారంభించనున్నారు. సున్మర్కే పాటశాలను జుమురహ్ త్రీభుజాకార విధానంలో నిర్మితమైంది. ఫొర్తెస్ ఎడ్యుకేషన్ బ్రిటిష్ విద్యా ప్రణాళిక ప్రకారం ఆయా పాట్యంశాలను అనుసరించి బోధన జరపనుంది. ఈ ఏడాది నర్సరీ నుంచి ఫౌండేషన్ దశ వరుకు 13 ఏళ్ళ వరుకు ఇక్కడ విద్యావిధానం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా సాంకేతిక విధానాలతో చదువు నేర్పిస్తారు, అలాగే. లాప్ టాప్ లు , ట్యాబ్ లు ఉపయోగించి విద్యను నేర్పిస్తారు. ఈ - పుస్తకాలను , ఆన్ లైన్ ఒనరులను ఇక్కడ వినియోగించనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







