GMRIT - ఉన్నత నైపుణ్యాలు, నవీన భారతదేశానికి చిరునామా

- November 17, 2020 , by Maagulf
GMRIT - ఉన్నత నైపుణ్యాలు, నవీన భారతదేశానికి చిరునామా

1997లో స్థాపించబడిన, జిఎంఆర్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రారంభమైన నాటి నుండి ఎంతో అభివృద్ధి చెంది, దేశంలోని విద్యాసంస్థలలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. విశాఖపట్నానికి 100 కి.మీ. దూరంలో ఉన్న GMRIT ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, రాజాంలో 117 ఎకరాల్లో విస్తరించిన అందమైన క్యాంపస్‌ను కలిగి ఉంది.

గ్రామీణ ప్రాంతంలో ఉన్నా, భారతదేశంలోని ఏ ప్రధాన సంస్థలోనైనా ఉండే అన్ని సదుపాయాలూ ఇక్కడ ఉన్నాయి. అనేక ప్రముఖ విద్యాపత్రికలు చేసిన సర్వేలో ఇది దేశంలోని మొదటి 50 ప్రముఖ ప్రైవేట్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

GMR గ్రూప్ యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగమైన GMR వరలక్ష్మి ఫౌండేషన్ యొక్క ప్రముఖ విద్యాసంస్థగా, GMRIT తనకంటూ ఉన్నత ప్రమాణాలను ఏర్పరచుకుని, ఉన్నత విద్య అధ్యయనం కోసం ఒక అందమైన మరియు సానుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా కోర్సుల రూపకల్పన

ఈ సంస్థ NAAC (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) ద్వారా ‘ఎ’ గ్రేడ్ (సెకెండ్ సైకిల్) గుర్తింపు పొందింది. వాషింగ్టన్ ఒప్పందానికి అనుగుణంగా ఇక్కడ అన్ని యుజి ప్రోగ్రామ్‌లు ఎన్‌బిఎ (టైర్ I) (థర్డ్ సైకిల్) గుర్తింపు పొందాయి. అంతే కాకుండా ఈ విద్యాసంస్థ ARIIA (అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్)లో 201-250 బ్యాండ్‌లో; NIRF (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్)లో 50-75 బ్యాండ్‌లో స్థానం పొందింది. ఒక స్వయంప్రతిపత్తి సంస్థ అయిన GMRIT కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా GMRIT విద్యార్థులకు సాంకేతిక కోర్సుల శ్రేణిని అందిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం బీటెక్‌లో ఏడు U.G. కార్యక్రమాలను అందిస్తోంది (కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). అన్ని ఇంజనీరింగ్ విభాగాలలో పి.జి. ప్రోగ్రాములను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం అన్ని ఇంజనీరింగ్ శాఖలలో సుమారు 3500 మందికి పైగా విద్యార్థులు ఉండగా, సుమారు 50% మంది విద్యార్థులకు క్యాంపస్‌లోనే హాస్టల్‌ సౌకర్యాలు కల్పిస్తున్నారు.

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆచరణాత్మక అనుభవంతో, పాఠ్యాంశాలను బలోపేతం చేయడం GMRIT లక్ష్యం. నిరంతరం ఎదగడానికి ప్రయత్నిస్తూ ఈ విద్యాసంస్థ, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రధాన సంస్థలతో పోటీపడుతోంది.

సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నమైన అభ్యాస వాతావరణాన్ని అందిస్తున్న GMRIT, విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం అన్నివేళలా సేవలను అందిస్తుంది. నూతన జాతీయ విద్యా విధానం (NEP) 2020లో పేర్కొన్న విధంగా సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు సృజనాత్మకతపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. 

పరిశ్రమల కోసం ఒక టాలెంట్ పూల్ సృష్టిస్తున్న GMRIT

కెరీర్ మరియు డెవలప్‌మెంట్ సెంటర్ (CDC) అనే ప్రత్యేక విభాగం ద్వారా GMRIT శిక్షణ, నియామక కార్యకలాపాలను చేపడుతోంది. ప్లేస్‌మెంట్ శిక్షణ, ఉన్నత విద్య, వ్యవస్థాపకత, ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను CDC చూసుకుంటుంది. పరిశ్రమ అవసరాలను తెలుసుకోవడానికి CDC పరిశ్రమలు, పూర్వ విద్యార్థులతో మంచి సంబంధాలను కలిగి ఉంది. పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా ఇక్కడి పాఠ్యాంశాలను తీర్చిదిద్దారు. సబ్జెక్ట్ మ్యాటర్ నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్లు ఇక్కడి అభ్యాసంలో భాగం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయంప్రతిపత్త సంస్థలలో స్వయంప్రతిపత్తి సామర్థ్యాన్ని పెంచే ఇన్‌స్టిట్యూషనలైజ్డ్ ఫుల్ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ (FSI)ను అందించడంలో GMRIT ముందంజలో నిలిచింది. ఇంటర్న్‌షిప్ కోసం ఇక్కడ CDCకి ప్రత్యేక విభాగం ఉంది. ప్రస్తుతం సుమారు 1000 మందికి పైగా విద్యార్థులను FSI కోసం పంపగా, 30% మంది విద్యార్థులకు ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ అందింది. 2013 - 2014 నుండి సుమారు 8 వేల మందికి పైగా విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్‌షిప్ కోసం పంపారు.

దీనికి తోడు, బి.టెక్ 3వ సెమిస్టర్ నుండే ఉపాధి నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులను అందించే విధంగా  పాఠ్యాంశాలను రూపొందించారు. CSE & IT విభాగం, SKILL GMRIT ద్వారా మిగతా అన్ని శాఖల్లోని విద్యార్థులలో కోడింగ్ నైపుణ్యాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇక్కడ విద్యార్థులను హాకథాన్‌లు, ఇతర సాంకేతిక పోటీలలో పాల్గొనమని ప్రోత్సహిస్తారు.

ఇటీవల సాధించిన విజయాలు

GMRIT నుండి ఇటీవల విజయం సాధించిన వారిలో బి.టెక్ చివరి సంవత్సరం (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్‌ఇ) చదువుతున్న సిహెచ్.రంగా అరవింద్, ఎన్. ప్రణీల్ రెడ్డి ముఖ్యులు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వీరు అమెజాన్ నుంచి ఏడాదికి రూ.19 లక్షల క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫర్‌ పొందారు.

వీరితో పాటు, జిఎంఆర్‌ఐటి నుండి 15 మంది విద్యార్థులు టిసిఎస్, ఇన్ఫోసిస్, వర్చుసా జిటిపి మరియు హెక్సావేర్ టెక్నాలజీస్ వంటి పలు ప్రసిద్ధ సంస్థలలో నియామకాలు పొందారు. ఈ విద్యార్థులే కాకుండా, మరో 14 మంది దేశవ్యాప్తంగా కోడ్ విటా (టిసిఎస్), ఇన్ఫీటీక్యూ (ఇన్ఫోసిస్) మరియు న్యూరల్ హాక్ 4.0 (వర్చుసా జిటిపి) లాంటి కోడింగ్ పోటీలను విజయవంతంగా పూర్తి చేసి, ప్రోత్సాహపూర్వకమైన ప్యాకేజీలను పొందారు. గత ఐదేళ్లలో జిఎంఆర్‌ఐటి నుండి 2500 మందికి పైగా విద్యార్థులను వివిధ కార్పొరేట్‌ సంస్థలలో ప్లేస్ మెంట్లు పొందారు.

విద్యార్థులకు అందుబాటులో గ్లోబల్ ఎడ్యుకేషన్  

GMRIT పలు విదేశీ విశ్వవిద్యాలయాలు మరియు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా తమ విద్యార్ధులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేందుకు కృషి చేస్తోంది. ఈ అంతర్జాతీయ ఒప్పందాల  ఫలితంగా, గత విద్యా సంవత్సరంలో 6 నెలల వ్యవధిలో ఐదుగురు మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం కోసం మలేషియాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, పెట్రోనాస్ (యుటిపి)కు వెళ్లారు. దీనికి తోడు, సిఎస్ఇ విభాగానికి చెందిన మరో విద్యార్థి ప్రియ పూర్తి సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ కోసం జపాన్ లోని పుకుయోకాలో ఉన్న “కోటోజ్నా ఇన్‌కార్పొరేషన్”కు వెళ్లారు.

GMRIT కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్

ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేవి అందరి నోటా వినిపించే మాటలు. వ్యాపారం, విద్య, వ్యవసాయం, వ్యక్తిగత జీవితం, పాలన వంటి అన్ని రంగాలలో AI ప్రమేయం ఉంది. AI ఏ ఇంజనీరింగ్ శాఖలోనూ తప్పనిసరి సాంకేతిక పరిజ్ఞానమైంది. సమర్థత కలిగిన, ఉపాధి పొందగల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావాలంటే, AI టెక్నాలజీలలో నైపుణ్యాలు తప్పనిసరి అయ్యాయి. “రేపటి ఇంజనీర్లకు నేడు శిక్షణ” అనే నినాదంతో, GMRIT ఆధునిక నైపుణ్యాలకు సంబంధించిన అన్ని కోర్సులను కలిగి ఉంది. వాటిలో కొన్ని: స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, సూపర్ కంప్యూటింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ తయారీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ చిప్ డిజైన్ మరియు స్మార్ట్ గ్రిడ్.

AI కోసం GMRIT ఒక ప్రత్యేకమైన లాబొరేటరీని స్థాపించింది. AP లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ సంస్థలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాబొరేటరీ మొట్టమొదటిది. దీనిలో NVIDIA QUADRO RTX6000 workstations, P1000 డెస్క్‌టాప్‌లతో హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ లాబొరేటరీ విద్యార్థుల నైపుణ్యాలకు పదును పెడుతుంది. పరిశోధనపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. ఈ లాబొరేటరీలో AI కోసం ప్రత్యేక నిపుణుల బృందం ఉంది. ప్రస్తుతం ఇది ఇంజనీరింగ్ టెక్నాలజీ అన్ని విభాగాలలోని విద్యార్థులకు AI, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలలో ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తోంది. ఈ సదుపాయాన్ని బయటి విద్యార్థులకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు.

అంతర్జాతీయ పరిశోధనా పత్రికల్లో ఉపాధ్యాయుల రీసెర్చి పేపర్లు

GMRITలోని ఉపాధ్యాయులు తమ పరిశోధన ఫలితాలను విద్యా సంబంధిత పత్రికలలో ప్రచురించేలా వారిని ప్రోత్సహిస్తారు. ఈ విద్యాసంస్థకు చెందిన సుమారు 250+ పరిశోధనా పత్రాలు స్కోపస్, SCI లలో పరిశోధకుల కోసం ఇండెక్స్ చేయబడ్డాయి. ఈ విద్యాసంస్థలో అన్ని విద్యార్థి సంబంధిత ప్రొఫెషనల్ బాడీ ఛాప్టర్లు ఉన్నాయి. అంతే కాకుండా విద్యార్థుల ప్రొఫెషనల్ అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వేలాదిమంది విద్యార్థులు హాజరయ్యే జాతీయస్థాయి విద్యార్థుల టెక్-ఫెస్ట్ STEPCONE తో సహా వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

ఈ విద్యాసంస్థ మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఇది స్థాపించినప్పటి నుండి 9000కు పైగా  ఇంజనీర్లను ఉత్పత్తి చేసి, విద్య అనేది కలగా ఉన్న అనేక మంది వెనుకబడిన వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చింది. అనేకమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉన్నతస్థాయి ఉద్యోగాలలో ఉండడం, కొంతమంది తమ సొంత స్టార్టప్‌లను ప్రారంభించడం ఈ విద్యాసంస్థకు గర్వకారణం.

అనేక పర్యావరణ అనుకూల కార్యక్రమాలపై దృష్టి పెట్టే ఈ సంస్థ 6 వేలకు పైగా సంస్థలు పాల్గొన్న AICTE క్లీన్ మరియు స్మార్ట్ క్యాంపస్ అవార్డ్స్-2020లో మొదటి స్థానాన్ని పొందింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com