ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి వరద సహాయక కిట్లు అందజేసిన GMRVF
- November 20, 2020
హైదరాబాద్:ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలకు రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి పెనునష్టం వాటిల్లింది. అనేక కాలనీలు నీటిలో మునిగి, ప్రజలు అంతులేని బాధలను అనుభవించారు. వారి సమస్యలు ఇంకా తీరలేదు. నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండి ఉండటంతో, చాలా మంది తమ ఇళ్లలోని అనేక వస్తువులు గృహాలు పనికి రాకుండా పోయాయి, ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో వారు సహాయం చేసే వారి కోసం దురు చూస్తున్నారు.
ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయపడే ప్రయత్నంలో భాగంగా, జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) నగరంలో వర్షం కారణంగా ఎక్కువ నష్టపోయిన కొన్ని ప్రాంతాలను గుర్తించి, అక్కడ వరద సహాయక సామాగ్రిని, కొన్ని పాత్రలను, ఒక జత షోలాపూర్ బెడ్షీట్లు అందజేసింది. వర్షం కారణంగా నష్టపోయిన ప్రాంతాలైన హనుమాన్ నగర్, బండ్లగుడ, నాగోల్, అంబికా నగర్, చాంద్రాయనగుట్ట, చాదర్ఘాట్లలో ఈ పంపిణీ చేసారు.
GMRVF అక్టోబర్లో కూడా ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. ఆ సమయంలో అలీ నగర్ మరియు చాదర్ఘాట్ ప్రాంతాల్లో సుమారు 1000 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే లాక్ డౌన్ సమయంలో, GMRVF వలస కార్మికులకు సహాయం చేసింది. వారికి ఇదే విధంగా ఆహార పొట్లాలు మరియు రేషన్ కిట్లను పంపిణీ చేసింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!