ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణ మృదంగం..
- November 24, 2020
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మునపటి కంటే ఈసారి రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 5,29,270 పాజిటివ్ కేసులు, 7,961 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,707,681కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,405,388 మంది కరోనాతో మరణించారు. ఇక 41,298,500 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు..
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 12,783,723కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 263,812 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జంటినా, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 9,184,644 కేసులు నమోదు కాగా.. 134,308 మంది వైరస్ కారణంగా మరణించారు.
తాజా వార్తలు
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్‌లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!









