భారత్‌తో మరింత మెరుగైన సంబంధాల కోసం బహ్రెయిన్‌ యత్నం

- November 25, 2020 , by Maagulf
భారత్‌తో మరింత మెరుగైన సంబంధాల కోసం బహ్రెయిన్‌ యత్నం

మనామా:భారతదేశంతో ద్వైపాక్షిక బంధం మరింత అద్భుతంగా వుండేందుకోసం బహ్రెయిన్‌ ప్రయత్నాలు కొనసాగుతూనే వుంటాయని ఫారిన్‌ మినిస్టర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ లతీఫ్‌ బిన్‌ రషీద్‌ అల్‌ జయాని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ సుబ్రమణ్యం జైశంకర్‌తో భేటీ సందర్భంగా అల్‌ జయానీ ఈ వ్యాఖ్యలు చేశారు. పరస్పర గౌరవం, సహకారంతో ఇరు దేశాలూ స్నేహభావంతో ముందడుగు వేస్తున్నాయనీ, ఆయా విభాగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయని డాక్టర్‌ అల్‌ జయాని చెప్పారు. కింగ్‌డమ్‌లో భారత కమ్యూనిటీ పాత్రని కొనియాడారాయన. మినిస్టర్‌ జై శంకర్‌, ఇటీవల మృతి చెందిన ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫాకి నివాళులర్పించారు. భారత్‌తో సన్నిహిత సంబంధాల విషయంలో బహ్రెయిన్‌ నాయకత్వం చేస్తున్న కృషిని కొనియాడారు జై శంకర్‌.  

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్‌)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com