వరదల్లో వాహనంతో సహా ఓ కుటుంబం జలసమాధి

- February 18, 2016 , by Maagulf
వరదల్లో వాహనంతో సహా ఓ కుటుంబం జలసమాధి

యు.ఎ.ఇ.లో వర్షాలు ఏకధాటిగా కురవడంతో వాగులు వంకలు  లోయల నుంచి వరదనీరు పొంగి పొర్లుతుంది. రెప్పపాటులోవిరుచుకుపడిన వరదలు  ఓ కుటుంబంను వాహనంతో సహా జలసమాధి చేసింది.ఈ విషాదకర సంఘటన బుధవారం రస అల్ ఖమహ్ ప్రాంతంలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ప్రమాదంలో ఎమిరేట్స్ కు  చెందిన ఒక తల్లి , ఆమె 11 ఏళ్ళ కుమార్తె , 3, 6 ఏళ్ళ వయస్సు ఉన్న ఇరువురు కుమారులు ఈ  దుర్గటనలో మరణించారు. వీరు చనిపోయే ముందు  వాహనంతో సహా ఎంతో దూరం కొట్టుకుపోయారు. కాగా వాహనం నడుపుతున్న కుటుంబ యజమానిని స్థానికులు రక్షించారు. ఈ వరద ప్రమాదంలో తల్లి , కుమార్తెల మృతదేహాలు బుధవారం లభ్యం అయ్యాయి.  ఇరువురు చిన్నారుల శవాలును గురువారం ఉదయం కనుగొన్నారు. నది పరివాహక ప్రాంతం ఇసుకలో 500 మీటర్ల దూరం వాహనాన్ని నడుపుతుండగా, ఆ మార్గంలో అకస్మాత్తుగా వరద ఉదృతంగా ఎదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు  పేర్కొంటున్నారు. నిరంతరంగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా లోయలు నిండిపోయి ఒక్కసారిగా నీరు విడుదల కాబడి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తున్నాయి. జారిపోయే గుణమున్న ఇటువంటి ప్రదేశాలలో ప్రయాణాలు మంచిది కాదని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదంలో స్థానికుల సహాయంతో రక్షింపబడిన కుటుంబ యజమాని ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలుస్తుంది    

 
              
                    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com