ఫేక్ స్టెరిలైజర్లు: ఐదుగురు అక్రమ వలసదారుల అరెస్ట్
- November 26, 2020
రియాద్:ఐదుగురు అక్రమ వలసదారుల్ని ఫేక్ స్టెరిలైజర్లు, డిటర్జెంట్ల ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు సౌదీ పోలీసులు వెల్లడించారు. నిందితుల్ని పాకిస్తానీ మరియు బంగ్లాదేశీ జాతీయులుగా గుర్తించినట్లు మక్కా రీజియన్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ మొహమ్మద్ అల్ గామ్ది చెప్పారు. ఫేక్ ట్రేడ్ మార్కుల్ని ఉపయోగించి, కెమికల్ పదార్థాలతో బాట్లింగ్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. నిందితుల నుంచి 2,256 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పంపిణీకి ముందు నిందితులు వాటిని ఓ వేర్ హౌస్‌లో భద్రపరిచారు. నిందితుల్ని అరెస్ట్ చేశామనీ, చట్టపరమైన ప్రొసిడ్యూర్స్ పూర్తి చేసి, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం







