వీసా ఉల్లంఘనుల్ని హైర్ చేసుకున్నారా? అప్రమత్తమవ్వండిలా!
- November 26, 2020
దుబాయ్: రెసిడెన్సీ నిబంధనల్ని ఉల్లంఘించిన వ్యక్తిని హైర్ చేసుకున్నారా? అయితే, అలాంటివారికి 50,000 దిర్హాముల జరీమానా లేకుండా మరో అవకాశం కల్పిస్తున్నట్లు సీనియర్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. నేచురలైజేషన్ మరియు రెసిడెన్సీ ప్రాసిక్యూషన్ చీఫ్, అడ్వొకేట్ జనరల్ డాక్టర్ అలి హుమైద్ బిన్ ఖాతిమ్ మాట్లాడుతూ, దుబాయ్ అటార్నీ జనరల్, సంబంధిత శాఖలకు స్పష్టమైన సూచనలు చేశారు. ఎవరైతే, ఉల్లంఘనులకు పని కల్పించారో అలాంటివారు, ఆయా ఉల్లంఘనుల స్టేటస్ మార్చుకోగలిగితే, ఆయా కేసుల్ని కొట్టివేయడం జరుగుతుందని చెప్పారు. అక్రమ వలసదారుడికి గనుక నిబంధనలకు విరుద్ధంగా పని కల్పిస్తే అలాంటివారికి 100,000 దిర్హాముల వరకు జరీమానా, రెండు నెలల జైలు శిక్ష విధించే అవకాశం వుంటుంది. విజిట్ లేదా టూరిస్ట్ వీసా కలిగివున్నవారికి పని కల్పిస్తే అలాంటివారికి 50,000 దిర్హాముల జరీమానా విధించడం జరుగుతుంది. కాగా, వర్కర్స్‌కి ఏమైనా సమస్యలు వుంటే, కాల్ సెంటర్ నెంబర్ 80060కి ఫోన్ చేసి తెలపవచ్చు. ఇన్‌స్పెక్టర్స్, వర్క్ సైట్‌కి వెళ్ళి, సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ యాక్టింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మొహ్‌సెన్ అల్ నెసీ చెప్పారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







